ఇప్పుడు ఈ కామెంట్.. దేశవ్యాప్తంగా జోరుగా వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ సర్.. గళం విప్పారంటే.. ఆ మాటల ప్రవాహం.. గంగా నది జోరుతో పోటీ పడుతున్నట్టుగా ఉంటుంది.
ఆయన ఏ విషయాన్నయినా.. తనకు అనుకూలంటూ.. కృష్ణానది పాయల్లా ఎటువైపైనా మలుపు తిప్పగలరు. ఎప్పుడో.. నెహ్రూ హయంలోనో.. ఇందిరమ్మ హయాంలోనో.. మహాత్ముడి హయాంలో జరిగిన విషయాలను సందర్భాను సారంగా ఆయన అలవోకగా చెప్పగలరు.
కట్ చేస్తే.. కీలకమైన కొన్ని విషయాలను మాత్రం ఆయన మరిచిపోతున్నారట. అవి కూడా.. 2014-2022 మధ్య జరిగిన కీలక పరిణామాలు కావడం.. మరింత చిత్రంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఈ విషయాలను ఎవరైనా అడిగితే.. "ఏమో గుర్తు లేదు. మరిచిపోయాను. రాసి పెట్టుకోలేదు. అది చిన్నవిష యం. ఇవి కూడా గుర్తు పెట్టుకుంటారా? మీరు కావాలని ప్రశ్నిస్తున్నారు" అని చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు మోడీ సర్! అని నెటిజన్లు అంటున్నారు.
మరి ఇంతకీ.. ఆ విషయాలు ఏంటి? మోడీ అంతగా గుర్తు పెట్టుకోవాల్సిన, రాసుకోవాల్సిన విషయాలు కాదని ఎందుకు? అనేది.. చూస్తే.. చాలా చిత్రంగా అనిపిస్తుంది. మరి మోడీ సర్.. అంటే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఆ గుర్తులేని, రాసిపెట్టుకోని.. లెక్కలు లేని విషయాలు చూద్దామా?!
+ 2014 నుంచి 2020 వరకు దేశంలో ఎన్ని ఆకలి చావులు సంభవించాయి.
+ 2014 నుంచి దేశంలో ఎన్ని మత ఘర్షణలు జరిగాయి. వీటిలో ఎంత మంది మైనారిటీ లు చనిపోయారు.
+ దేశంలో కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలు ఎన్ని? ఎన్నింటికి చేయూత ఇచ్చారు.
+ దేశంలో కరోనా మరణాలు ఎన్ని? ఎంత మందికి పరిహారం ఇచ్చారు?
+ వలస కూలీలు ఎంత మంది చనిపోయారు?
+ అప్పులు ఎగ్గొట్టేందుకు ఎంత మంది దేశం విడిచి పారిపోయారు? వారిని ఎలా తెస్తారు?
+ కేంద్రం చేసిన అప్పులతో చేసిన అభివృద్ధి పనులు ఎన్ని.. ఏయేవాటికి ఎంత ఖర్చు చేశారు?
+ లాక్ డౌన్ సమయంలో సంభవించిన ఆకలి మరణాలు ఎన్ని?
వీటికి కేంద్రం దగ్గర సమాధానం లేదు. సో.. మోడీసర్‌ను పదే పదే అడిగి విసిగించొద్దు!! ఇదీ.. పార్లమెంటుకు కేంద్ర మంత్రి చెప్పిన సమాధానం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.