కొన్ని సంఘటనలు ఎక్కడో జరిగి... మరెక్కడికో కనెక్ట్ అవుతుంటాయి. చాలా సాధారణంగా కనిపించే కొన్ని సంఘటనలు అత్యంత ప్రభావవంతమైన ఎపిసోడ్‌కు దారితీస్తుంటాయి. అలాంటిదే తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత టూర్లో జరిగింది.
రెండ్రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లండన్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకొని గుజరాత్ లోని అహ్మదాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన బుల్డోజర్ ఎక్కిన ఫోటో ఓ రేంజ్‌లో వైరల్ అయింది.
బ్రిటన్ లో ఉన్న భారతీయుల్లో ఎక్కువమంది గుజరాత్ వారే కావడంతో... జాన్సన్ నేరుగా గుజరాత్ వచ్చారు. భారత పర్యటనలో భాగంగా గురువారం ఉదయం గుజరాత్ చేరుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వడోదరాలో రూ.995 కోట్లతో నిర్మించిన జేసీబీ పరిశ్రమను ప్రారంభించారు.
గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్తో కలిసి పరిశ్రమను సందర్శించారు. జేసీబీ ఫ్యాక్టరీ ప్రారంభించిన అనంతరం వాహనంపై ఎక్కి ఫొటోలు దిగారు. ఈ ఫోటో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవడం వెనుక ప్రస్తుతం బీజేపీ రాజకీయమే కారణమని అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయం నుంచి బుల్ డోజర్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అక్రమార్కులపై తగు చర్యలు తీసుకునేందుకు బుల్ డోజర్లు ఉపయోగిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడమే కాకుండా ఆ మేరకు తగు నిర్ణయాలు కూడా తీసుకోవడంతో... బుల్ డోజర్ పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కింది.
బీజేపీ బుల్ డోజర్ ప్రచారాన్ని కూడా తన అనుకూల వర్గాల ద్వారా చేసేస్తోంది. ఇలాంటి సమయంలో బోరిస్ బుల్ డోజర్ ఫోటో ఇటు బీజేపీ అనుకూల అటు ప్రతికూల వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.