పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ కన్నా రెండు ముందే సమావేశాలు ముగించారు. గతానికి భిన్నంగా ఈసారి పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరు తెలిసిందే. పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది మోడీ సర్కారు. ఇప్పటికి భిన్నధ్రువాలుగా ఉన్న విపక్షాల మధ్య గతానికి మించిన సామరస్యత కొ్ట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పార్లమెంటుసమావేశాలు ప్రారంభం కావటానికి ముందు అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పెగాసస్ నిఘా అంశం మీద విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం.. దాని మీద చర్చ కోసం పట్టుబట్టటం తెలిసిందే. అయినప్పటికీ చర్చకు మోడీ సర్కారు అంగీకరించలేదు. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఉభయ సభల్ని స్తంభింపచేస్తూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి.
మన్మోహన్ సింగ్ రెండో సారి అధికారంలోకి వచ్చిన సమయంలో కొన్ని అంశాలపై ప్రభుత్వ తీరును తప్పపడుతూ బీజేపీ ఇతర విపక్షాలు సభను దీర్ఘకాలం పాటు స్తంభింపచేయటం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మరోసారి విపక్షాలు అలాంటి పరిస్థితిని తీసుకొచ్చాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సాధించి విజయంతో పుంజుకున్న మమతా బెనర్జీ పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశ రాజధానికి రావటం.. విపక్ష నేతతో పాటు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.
అయితే.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఇతర విపక్షాలతో కలిసి కట్టుగా ఆందోళనలు చేయటానికి టీఎంసీ ఎంపీలు కూడా మద్దతు ఇవ్వటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కాకుండా మిగిలిన విపక్షాలు ఏకమైనప్పటికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించిన పరిస్థితి. శక్తివంతమైన మోడీ సర్కారును ఎదుర్కోవటానికి ఏ ఒక్క పార్టీకి అంత బలం లేని నేపథ్యంలో.. అందరూ కలిసి ఉమ్మడిగా పోరాటం చేయటం మినహా మరో మార్గం లేదనే చెప్పాలి. ఈ కారణంతో.. తమ మధ్యనున్న కొన్ని విభేదాల్ని పక్కన పెట్టేసి మరీ విపక్షాలు ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నాయి.
ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వెంటనే రంగంలోకి దిగారు. వివిధ పార్టీ నేతలతో ఆమె వర్చువల్ గా సమావేశమయ్యారు. మోడీకి వ్యతిరేకంగా కలుస్తున్న రాజకీయ శక్తులన్నింటికి ఏకం చేసేందుకు సోనియాగాంధీ ఈ నెల 20న విపక్ష నేతలతో వర్చువల్ సమావేశానికి ఓకే చెప్పారు. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేలతో పాటు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లను కూడా సోనియాతో భేటీకి ఆహ్వానించారు.
సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉన్న నేపథ్యంలో.. విపక్షాలన్ని పునరేకీకరణ కావటం.. మోడీ సర్కారు వ్యతిరేకత శక్తులు ఒకే వేదిక మీదకు రావటం ద్వారానే బలమైన సవాల్ ను విసురుతామన్న అభిప్రాయానికి వారు వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం రగిలిన వేడిని కొనసాగిస్తూ.. వచ్చే పార్లమెంటు సమావేశాలకు విపక్షాల మధ్య ఐక్యతా రాగాన్ని పార్లమెంటు సాక్షింగా తీసుకురావటం ద్వారా.. మోడీ సర్కారుకు ప్రత్యమ్నాయ కూటమి ఒకటి తెర మీదకు వస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం చేతులు కలిపిన మోడీ వ్యతిరేకులంతా మరికొద్ది నెలల్లో జరగనున్న యూపీ ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేయటం ద్వారా.. కూటమిని బలోపేతం చేయటం.. యోగి సర్కారు మరోసారి కొలువు తీరకుండా ఉండేలా చేయాలన్న బలమైన ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అధికార మార్పిడి జరగటం ద్వారా మోడీ సర్కారు బలాన్ని బలహీనం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. దీనికి తగ్గట్లే.. ప్రముఖ న్యాయవాది.. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతగా వ్యవహరిస్తున్న కపిల్ సిబల్ ఇంట్లో ఈ నెల 10న ఏర్పాటు చేసిన డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి పలు పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. అయితే.. ఈ సమావేశానికి సోనియాతో పాటు.. రాహుల్ గాంధీ హాజరు కావటం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరే కాదు.. బీజేపీతో మొన్నటి వరకు కలిసి ప్రయాణించిన అకాలీదళ్ ను కూడా పిలిచారు. కానీ.. ఆ పార్టీ నుంచి ఎవరూ హారు కాలేదు. అదే విధంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా హాజరు కాలేదు.
అయితే.. ఈ భేటీకి శరద్ పవార్.. లాలూ ప్రసాద్ యాదవ్.. అఖిలేష్ యాదవ్.. సంజయ్ రౌత్.. డెరెక్ ఓ బ్రియాన్.. ఒమర్ అబ్దుల్లాలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాల మీద వీరు చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. మెగాసస్ గూఢచర్యం ఆరోపణలు.. పెట్రోల్.. డీజిల్ ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావటమే కాదు.. భిన్న ధ్రువాల్ని కలిపే శక్తి ఈ నినాదానికి ఉంది.
ప్రస్తుతానికి 15కు పైగా రాజకీయ పార్టీలు ఐక్య ఫ్రంట్ గా ఏర్పడి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈసారి సమావేశాలు సరిగా జరగకుండా మోడీ సర్కారును ఇరుకున పెట్టే విషయంలో కొంతమేర విజయవంతమయ్యాయని చెప్పాలి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. గతంలో మాదిరి మోడీ ప్రభుత్వానికి తిరుగులేని పరిస్థితి ఇప్పటికైతే లేదన్న విషయం స్పష్టమైంది.
తమకున్న మిత్రులు కొంతకాలంగా ఒక్కొక్కరుగా తగ్గిపోతుంటే.. అందుకు భిన్నంగా ప్రత్యర్థులు మాత్రం అంతకంతకూ కొత్త వారు చేరటంతో మరింత బలోపేతం అవుతున్న విషయాన్ని మోడీ అండ్ కో గుర్తిస్తుందా? అందుకు విరుగుడు కార్యక్రమాన్ని ఏ మాత్రం ఆలస్యం చేసినా.. ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది. భిన్నధ్రువాలు కలుసుకోవటం కష్టమే. కానీ.. కలుసుకునే పరిస్థితే కల్పిస్తే.. ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు మోడీ సర్కారుకు కొత్త ఇబ్బందుల్ని తెచ్చి పెడతాయంటున్నారు. మరేం జరుగుతుందోకాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.