మోడీకి షాకింగ్‌ గా మారిన కేంద్ర‌మంత్రి మ‌ర‌ణం

Update: 2017-05-18 06:43 GMT
కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌.. అట‌వీశాఖామంత్రి అనిల్ మాధ‌వ్ ధ‌వే క‌న్నుమూశారు. 61 ఏళ్ల ఆయ‌న గురువారం ఉద‌యం మ‌ర‌ణించారు. ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర దిగ్భాంత్రి వ్య‌క్త‌మ‌వుతోంది. అనిల్ ద‌వే మ‌ర‌ణం ప్ర‌ధాని మోడీకి షాకింగ్‌ గా మారింది. ఎందుకంటే.. నిన్న సాయంత్రం వ‌ర‌కూ అనిల్ ద‌వే ప్ర‌ధానితో పాటే ఉన్నార‌ట‌. ఆ విష‌యాన్ని త‌న ట్వీట్‌ ద్వారా వెల్ల‌డించారు మోడీ.

'నిన్న సాయంత్రం వ‌ర‌కూ నా ద‌గ్గ‌రే ఉన్నారు. కీల‌క విధానాల గురించి చ‌ర్చించాం. అంత‌లోనే ఆయ‌న మ‌ర‌ణించ‌ట‌మా? ఆయ‌న మ‌ర‌ణం వ్య‌క్తిగ‌తంగా తీవ్ర న‌ష్టం' అని మోడీ పేర్కొన్నారు. 2009లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ఆయ‌న మోడీ క్యాబినెట్‌లో కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌.. అట‌వీశాఖామంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 1956 జులై 6న బాద్‌న‌గ‌ర్‌లో జ‌న్మించిన ఆయ‌న మ‌ర‌ణం బీజేపీ వ‌ర్గాల్ని తీవ్ర దిగ్భాంత్రికి గురి చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. ఆయ‌న ఎలా మ‌ర‌ణించార‌న్న దానిపై స్ప‌ష్ట‌మైన స‌మాచారం రావ‌టం లేదు. ఆయ‌న కొంత‌కాలంగా క్యాన్స‌ర్ తో బాధ ప‌డుతున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రికొన్ని మీడియా సంస్థ‌ల క‌థ‌నాల ప్ర‌కారం.. ఆయ‌న తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌టంతో ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా.. చికిత్స చేస్తుండ‌గా మ‌ర‌ణించిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా కేంద్ర‌మంత్రి మ‌ర‌ణం ఎలా సంభ‌వించింద‌న్న విష‌యం మీద మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ స్ప‌ష్ట‌త రాలేద‌ని చెప్పాలి. మ‌రోవైపు.. అనిల్ ద‌వే ఆక‌స్మిక మ‌ర‌ణంపై బీజేపీ నేత‌లు ప‌లువురు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News