అమరావతి శంఖుస్థాపన కోసం ఏపీ పర్యటనకు వస్తున్నప‌్రధాని నరేంద్ర మోడీకి ఏం వడ్డించబోతున్నారు? శాఖాహారి అయిన మోడీ మెనూలో ఏం ఉంటుంది? ప‌్రధాని మెనూలో ఆంధ్ర రుచులు ఉంటాయా అనే ఆసక్తికర చర్చకు తెరపడింది.
ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పటికీ నరేంద్రమోడీ మోడీ నవరాత్రుల ఉపవాస దీక్షలో ఉన్నారు. శంఖుస్థాపన రోజు నాటికి మోడీ దీక్ష విరమించకపోతే నిమ్మరసం - పండ్లు సిద్ధం చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించింది. విరమించిన పక్షంలో ఆంధ్రాభోజనం రెడీ చేసుకోవచ్చని సూచించింది. దీంతో మోడీ భోజనంలో ఆంధ్రుల అభిమాన వంటకాలైన గోంగూర పచ్చడి - ఉలవచారు - బొబ్బట్లు ఉండేలా చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా.... కార్యక్రమానికి వస్తున్న ఇతర వీవీఐపీల కోసం ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. వాటిలో చక్కెర పొంగలి - పులిహోర - గారెలు - వెజ్ బిర్యానీ - ఉలవచారు - ఆవకాయ - దప్పళం - పుల్కా - రోటీ - వెజ్ కర్రీలు ఉన్నాయి.
ఇక విశిష్ట అతిథుల హోదాలో ఉన్న జపాన్ - సింగపూర్ - చైనా ప్రతినిధులకోసం వారి వంటకాలను రెడీ చేశారు. ఆయా దేశాలకు చెందిన ప్రత్యేక చెఫ్ లకు ఇప్పటికే కబురు పెట్టారు. ప్రతినిధులకు చెందిన దేశాలకు సంబంధించిన ప్రత్యేక వంటకాలను ఈ చెఫ్ లు వండివారుస్తారు. ఇక ఈ విందు వంటకాలను దేశంలోని ప్రముఖ ఐటిసి హోటల్ ఆధ్వర్యంలో కేఎంకే ఈవెంట్ బృందం తయారుచేస్తున్నది.