షాకింగ్‌!..డీ గ్యాంగ్ కోడ్ వ‌ర్డ్స్‌ లో మోదీ పేరు!

Update: 2017-09-30 05:39 GMT
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో మార‌ణ హోమం సృష్టించిన త‌ర్వాత దేశం వ‌దిలి పారిపోయిన అండ‌ర్ వ‌రల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం...  ఆ త‌ర్వాత త‌న నెట్ వ‌ర్క్‌ ను దేశ‌దేశాల‌కు విస్త‌రించారు. దాయాదీ దేశం పాకిస్థాన్‌ లోని కీల‌క న‌గ‌రం క‌రాచీలో ద‌ర్జాగా ల‌గ్జ‌రీ లైఫ్ అనుభ‌విస్తున్న దావూద్‌... అక్క‌డి నుంచే త‌న నేర సామ్రాజ్య కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్నాడు. పాకిస్థాన్ సైన్యం ర‌క్ష‌ణ‌లో అత‌డు చాలా సుర‌క్షితంగానే ఉన్న‌ట్లు కూడా ఇప్ప‌టికే భార‌త్ నిఘా వ‌ర్గాలు నిర్ధారించుకున్నాయి. అయితే అస‌లు దావూద్ త‌మ దేశంలోనే లేడంటూ పాక్ చెబుతున్న మాట‌ల‌న్నీ కూడా ఒట్టి బూట‌కాలే అని ఇటీవ‌లే మ‌రోమారు తేలిపోయింది.

ఓ బెదిరింపుల కేసులో ముంబై పోలీసులు దావూద్ సోద‌రుడు ఇక్బాల్ క‌స్క‌ర్‌ ను ఇటీవలే అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కోర్టు అనుమ‌తితో క‌స్కర్‌ ను విచార‌ణ నిమిత్తం త‌మ క‌స్ట‌డీకి తీసుకున్న పోలీసులు త‌మ‌దైన శైలిలో లాఠీలు ఎత్తేస‌రికి చాలా విష‌యాలు అత‌డి నోటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దావూద్ పాక్‌ లోనే ఉన్నాడ‌ని క‌స్క‌ర్ చెప్పాడు. అంతేకాకుండా దావూద్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న చోటా ష‌కీల్ కూడా అక్క‌డే దావూద్ వ‌ద్దే ఉంటున్నాడ‌ని కూడా క‌స్క‌ర్ చెప్పాడు. డీ గ్యాంగ్‌ గా పేరు ప‌డిపోయిన దావూద్ నేర సామ్రాజ్యం ఎలా త‌మ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తుంద‌న్న విష‌యాల‌ను కూడా క‌స్క‌ర్ ఓ రేంజిలోనే వివ‌రించాడ‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే... చాలా షాకింగ్ అంశాలు కూడా ఉన్నాయి. డీ గ్యాంగ్ ఆట క‌ట్టించేందుకు నిత్యం భార‌త నిఘా వ‌ర్గాలు అప్ర‌మ‌త్తంగానే ఉన్నాయి. ఏ చిన్న క్లూ దొరికినా కూడా దానికి సంబంధించిన స‌మ‌గ్ర వివ‌రాల‌ను క్ష‌ణాల్లో సేక‌రించేస్తున్న భార‌త నిఘా వ‌ర్గాలంటే.. దావూద్ హ‌డ‌లిపోతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న అనుపానులు భార‌త నిఘా వ‌ర్గాల‌కు చిక్క‌కుండా అత‌డు చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డితో పాటు అత‌డి గ్యాంగ్ స‌భ్యులు ఫోన్ల‌లో సంభాషించుకునే స‌మ‌యంలో దాదాపుగా కోడ్ ల్యాంగ్వేజీనే వాడ‌తార‌ట‌.

ఆ కోడ్ లాంగ్వేజీ కూడా ఎంత పక‌డ్బందీగా ఉంటుందంటే... ఈ ఫోన్ కాల్స్ విన్న ఏ ఒక్కరికి కూడా అస‌లు కించిత్ అనుమానం కూడా రాద‌ట‌. షాకింగ్‌గా అనిపిస్తున్న స‌ద‌రు కోడ్ లాంగ్వేజీలో మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మ‌న రాజ‌ధాని ఢిల్లీతో పాటు ప‌లు ఆస‌క్తిక‌ర ప‌దాల‌ను ఆ గ్యాంగ్ వాడుతోంద‌ట‌. దావూద్‌ కు రైట్ హ్యాండ్‌ గా ప‌రిగ‌ణిస్తున్న చోటా ష‌కీల్ పేరుకు *మోదీ* ప‌దాన్ని డీ గ్యాంగ్ వాడుతోంద‌ట‌. అదే దావూద్ ఉంటున్న క‌రాచీ న‌గ‌రానికి *ఢిల్లీ* ప‌దాన్ని వాడుతున్నార‌ట‌. ఇక గ్యాంగ్ లీడ‌ర్‌గా ఉన్న దావూద్‌ను ఈ లాంగ్వేజీలో *బ‌డే*గా వ్వ‌వ‌హ‌రిస్తార‌ట‌. పోలీసు వ్యాన్‌ను *డ‌బ్బా*గా, ల‌క్ష రూపాయ‌ల‌ను *ఏక్ డ‌బ్బా* అని, కోటి రూపాయ‌ల‌ను *ఏక్ బాక్స్‌* అని పిలుస్తార‌ట‌.
Tags:    

Similar News