ప్రధాని మోడీ తీరు కాస్త భిన్నం. మాటలలో సందేశాల్ని ఇచ్చే ఆయన రాజకీయంగా చాలా కరుకుగా వ్యవహరిస్తారు. తనకు ఎదురైన ప్రతి ఇబ్బందిని ఆయన గుర్తు పెట్టుకుంటారు. సమయం చూసుకొని మరీ దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తుంటారు. మానసిక వికాస నిపుణుడిగా మాటలు చెప్పే మోడీ.. చేతల్లో మాత్రం అందుకు భిన్నమైన పాత్రను పోషిస్తుంటారు.
పాక్ లాంటి దేశానికి ముందస్తు ప్రణాళిక లేకుండా.. కేవలం గంటల వ్యవధిలో నిర్ణయం తీసుకొని.. ఆ దేశ గడ్డ మీద కాలు మోపి సంచలనం సృష్టించారు. ఇదంతా ఫ్రెండ్ షిప్ కోసమేనన్నట్లుగా వ్యవహరించారు. ఫ్రెండ్ కోసం.. ఫ్రెండ్ షిప్ కోసం మోడీ ఎంత ప్రయారిటీ ఇస్తారన్న భావన కలిగేలా చేశారు. ఒకవేళ మోడీలోని ఫ్రెండ్ కోణం నిజమే అయితే.. ఆయన సర్కారుకు మిత్రుడిగా వ్యవహరిస్తూ.. జమ్మూకాశ్శీర్ సర్కారులో భాగస్వామ్య పక్ష అధినేత ముఫ్తీ మహ్మద్ సయిద్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందిన సమయంలో (ఇటీవల మరణించారు) ఒక్కసారి కూడా ఎందుకు పరామర్శించలేదు?
ఆసుపత్రిలో చికిత్స పొందినంత కాలం మిత్రుడిని పలుకరించే తీరిక లేనంత బిజీగా మోడీ ఉన్నారని అనుకుంటే.. ఆయన మరణించిన తర్వాత అయినా ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు సైతం మోడీకి తీరిక లేదా? అన్న ప్రశ్న తలెత్తే పరిస్థితి. భాగస్వామి పక్ష అధినేత అనారోగ్యంతో మరణిస్తే.. ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీలో సందర్శించారు. అంతేకానీ.. ఆయన కుటుంబాన్ని పరామర్శించటం లాంటి పనులు చేయలేదు. ఎందుకిలా అనే ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి.
మోడీ తీరు గురించి బాగా తెలిసిన కాంగ్రెస్.. అదును చూసుకొని తన పరామర్శ రాజకీయ అస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా కాశ్శీర్ వెళ్లి.. ముఫ్తీ మహ్మద్ సయిద్ ఫ్యామిలీని పరామర్శించటంతో పాటు.. ముఫ్తీ మొహబూబను పలుకరించిన తీరు.. ఓదార్చిన వైనం రాజకీయ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదంతా మోడీ ఇచ్చిన అవకాశమనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేసిన మోడీకి.. సోనియా తనదైన శైలిలో షాకిచ్చారని చెబుతున్నారు.
కాశ్శీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి షరతుల్లేని రీతిలో సాయం అందిస్తామన్న సంకేతాన్ని కాంగ్రెస్ ఇస్తే.. ప్రస్తుత పరిస్థితి ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని మోడీ భావిస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో కష్టంలో ఉన్న ఫ్రెండ్ ఫ్యామిలీని పరామర్శించే విషయంలో మోడీ పెద్ద తప్పునే చేశారన్న మాట వినిపిస్తోంది. ఇదెంత వరకూ నిజమన్నది రానున్న రోజులు స్పష్టం చేయటం ఖాయం.