ప్రధాని మోడీ చాలా తెలివైన వారు. తాను ప్రారంభించిన పథకాలకు భావోద్వేగాలను అద్దటంలో ఆయన తర్వాతే. తాజాగా బంగారు బాండ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బంగారు బాండ్ల పథకానికి విశేష ప్రచారాన్ని కల్పించేలా ఆయన మాట్లాడారు.
దీపావళి పర్వదినం సందర్భంగా బహుమతులు ఇచ్చుకోవటం మామూలే. అయితే.. ఈసారి మత్రం మామూలు బహుమతుల కంటే కూడా భిన్నమైన బహుమతి ఇవ్వాలని సూచించారు. ఇంతకీ ఆ వెరైటీ బహుమతి ఏమిటన్న విషయానికి వస్తే.. కుటుంబ సభ్యులకు.. బంధువులకు.. స్నేహితులకు.. సన్నిహితులకు బంగారు బాండ్ల ను కొనుగోలు చేసి వారికి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అసలు సిసలు మార్కెటింగ్ హెడ్ గా వ్యవహరించిన మోడీని చూసినప్పుడు.. ప్రధానిగా ఉంటూ కూడా ఆయనలోని గుజరాతీ వ్యాపారి మాత్రం పోలేదంటూ చమత్కరిస్తున్నారు. మరి.. ప్రధాని పిలుపునకు బంగారు బాండ్లను ప్రజలు ఏమేరకు బహుమతిగా ఇస్తారో చూడాలి.