తెలంగాణ‌పై మోడీ పెద్ద మ‌నసు

Update: 2015-08-27 04:09 GMT
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రెండు గా విడివ‌డ్డ తెలుగు రాష్ర్టాలు ఇపుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని తేల్చిచెప్పిన మోడీ ప్ర‌భుత్వం... విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. అయితే ఆ చ‌ట్టం లాభాలు ఏపీ ప్ర‌భుత్వం కంటే ముందే..తెలంగాణ‌కు ల‌భించే ఏర్పాట్లు జ‌రుగుత‌న్నాయి.

అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాని న‌రేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  తెలంగాణ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో నెలకొల్పాల్సి ఉన్న 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోదీ పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే బొగ్గు కేటాయింపులు చేయాలని బొగ్గు, గనుల మంత్రిత్వశాఖకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీచేశారు. అలాగే పర్యావరణ అనుమతులు జారీచేయాలని సంబంధిత శాఖను ఆదేశించారు. ఈ ప్ర‌క్రియ అంతా వీడియో కాన్ఫ‌రెన్స్ సాక్షిగా పూర్తి చేయ‌డం గ‌మ‌నార్హం.

రామగుండం ఎన్టీపీసీలో కేంద్రం ఆధ్వర్యంలో అదనంగా మరో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు విషయంపై ప్రస్తుత పరిస్థితి గురించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మతో మాట్లాడుతూ  ప్రధానమంత్రి వాకబు చేశారు. దీనికి రాజీవ్‌ శర్మ సమాధానం చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కేటాయించామని, అలాగే సరిపోయేంత భూమికూడా ఉందని తెలిపారు. పర్యావరణ అనుమతుల కోసం పబ్లిక్ హియరింగ్‌ కూడా నిర్వహించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇవ్వాల్సి ఉందని, అలాగే తగిన బొగ్గు కేటాయింపులు చేయాల్సి ఉందని ప్రధాని దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ప్రధాని సంబంధిత శాఖలకు ఈ విషయంలో ఆదేశాలు ఇచ్చారు.

మొత్తంగా వీడియా కాన్ఫ‌రెన్స్ ద్వారా మోడీ తెలంగాణ‌పై త‌న మ‌మ‌కారాన్ని చాటుకున్న‌ట్లయింది.
Tags:    

Similar News