అగ్రకుల పేదలకు 10శాతం రిజర్వేషన్లు

Update: 2019-01-07 11:11 GMT
రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నరేంద్రమోడీ సారథ్యంలో ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు పదిశాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 10శాతం రిజర్వేషన్ల పెంపుకు సోమవారం కేబినెట్  ఆమోదం తెలిపింది.

ఇందుకోసం కేంద్రం రాజ్యాంగ సవరణ కూడా చేసేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. దీనివల్ల విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు పదిశాతం రిజర్వేషన్లు దక్కుతాయి. కాగా మొత్తం రిజర్వేషన్లు కేంద్రం నిర్ణయంతో 50 నుంచి 60 శాతానికి దక్కుతాయి. అగ్రకుల పేదలకు దీనివల్ల సౌకర్యం కలుగుతుంది.

ఈ మేరకు రంగం సిద్ధం చేసిన కేంద్రం లోక్ సభలో అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టనుంది. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న వారు దీనికి అర్హులు. ఐదు ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్న వారు రిజర్వేషన్లకు అర్హులని బిల్లులో పొందుపరిచారు.


Full View

Tags:    

Similar News