అయోధ్య రామమందిరానికి మోడీ సర్కార్ విరాళం ఇదే

Update: 2020-02-06 08:31 GMT
నరేంద్రమోడీ.. హిందుత్వ ఎజెండాతో గద్దెనెక్కిన ఈయన తన హయాంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న రెండు పెద్ద సమస్యలను పరిష్కరించారు. కశ్మీర్ ను విభజించి.. అయోధ్యలో రామాలయాన్ని సాధించి అబ్బురపరిచారు. ఇన్నేళ్ల స్వాతంత్ర భారతంలో హిందువుల కల అయిన అయోధ్య రామాలయ నిర్మాణానికి అడుగులు వేశారు. నిన్ననే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ కు చైర్మన్ గా మాజీ అటార్నీ జనరల్ పరాశరన్ ను నియమించారు.

ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణమే తరువాయి అని అనుకున్నారంతా.. ఇక ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు కూడా ఆహ్వానిస్తున్నట్టు మోడీషాలు పార్లమెంట్ లో తెలిపారు.

శ్రీరాముడు పుట్టిన జన్మభూమి కావడంతో ఈ ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు పోటెత్తడం ఖాయం. అందుకే ప్రధాని మోడీ అయోధ్య రామాలయ ట్రస్టును ఏర్పాటు చేసి తమ బీజేపీ సర్కారు తరుఫున విరాళంగా ఎంతిచ్చారో తెలుసా? కేవలం రూ.1 మాత్రమే.. ఒక్క రూపాయి మాత్రమే అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం ఇచ్చి మోడీ సర్కారు అందరికీ షాకిచ్చింది.

అయితే రామమందిర నిర్మాణం కోసం ఎవరైనా విరాళాలు ఇస్తే ఎటువంటి షరతులు లేకుండా స్వీకరిస్తామని మోడీ తెలిపారు. నగదు - ఆస్తుల రూపంలో ఇచ్చినా ట్రస్ట్ తీసుకొని నిర్మిస్తుందని చెప్పుకొచ్చారు.

ఇలా అయోధ్య రామాలయానికి రూ.1 విరాళం ఇచ్చి మోడీ వార్తల్లో నిలిచారు. ఎలాగూ దేశంలోని హిందుత్వ వాదులు, పారిశ్రామికవేత్తలు - బీజేపీ నేతలు - సాధువులు - మఠాధిపుతులు బాబాలు ఈ ఆలయానికి వేల కోట్లు కుమ్మరిస్తారు. అందుకే మోడీ సార్ తెలివిగా రూ.1 విరాళం ఇచ్చి ఖర్చును తప్పించుకున్నారన్న వాదన వినిపిస్తోంది.


   

Tags:    

Similar News