రాష్ట్ర ప్రయోజనాలను మరోసారి నరేంద్ర మోడీ సర్కార్ తుంగలో తొక్కేసింది. విభజన చట్టాన్ని యధాతథంగా అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏవేవో పనికిమాలిన కారణాలు చెప్పి నిర్వీర్యం చేసేసింది. ప్రత్యేక హోదా స్ధానంలో ప్రత్యేక ప్యాకేజి అన్నది. అలాగే విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్ ప్లేసులో దక్షిణ కోస్తా రైల్వేజోన్ అని సవరించింది. ఈ రెండు అంశాల్లో కేంద్రం ఏపీని నూరుశాతం మోసం చేసిందని జనాలందరికీ అర్ధమైపోయింది. ప్రత్యక్షంగా ఏమీచేయలేక జనాలు ఆ కోపాన్ని ఎన్నికల్లో చూపిస్తున్నారు.
అయినా కేంద్రంలోని బీజేపీకి బుద్ధి వచ్చినట్లు లేదు. తాజాగా దక్షిణకోస్తా రైల్వేజోన్ కూడా ఏర్పాటు చేయడం లేదని పరోక్షంగా ప్రకటించేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతోందని డీపీఆర్ రెడీ అవుతుందని చాలా చెప్పింది. తీరాచూస్తే తాజా ప్రకటన ప్రకారం అదంతా కేవలం కథ మాత్రమే అని అర్ధమైపోయింది. ఏమంటే కేంద్రం జోన్ ఏర్పాటుకు రెడీగా ఉన్నా, కొంత నిధులు కేటాయించినా రైల్వేబోర్డు సాధ్యం కాదని చెప్పిందట.
కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు చాలాకాలం పడుతుందని, వందలాది మంది సిబ్బంది, అధికారుల బదిలీలు పెద్ద సమస్యగా మారుతుందని రైల్వేబోర్డు అభిప్రాయపడిందట. కరోనా పరిస్ధితుల్లో జోన్లను విడదీయటం మరింత ఆలస్యమవుతుందని చెప్పిందట.
జోన్ల పునర్విభజన నుండి నోటిఫికేషన్ కే ఆరేళ్ళు పట్టిన సంగతిని బోర్డు గుర్తుచేసిందట. దీన్నిబట్టి కొత్త రైల్వేజోన్ ఏర్పాటు మరింతగా ఆలస్యమవుతుందని చెప్పిందట. జోన్, డివిజన్ ఏర్పాటుకు నిర్దిష్ట గడువును పెట్టుకోలేమని కూడా చెప్పిందట.
కాబట్టి దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటు హామీని పక్కనపెట్టేయమని బోర్డు చెప్పింది కాబట్టి హామీని పక్కనపెట్టేస్తున్నామనే అర్ధం వచ్చేట్లుగా రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
హామీని పక్కనపెట్టడానికి నిరాకరిస్తున్నట్లు చెప్పినా ఇక దక్షిణకోస్తా రైల్వేజోన్ కూడా ఏర్పాటు కాదని తేలిపోయింది. విచిత్రం ఏమిటంటే పచ్చగా ఉన్న పెద్ద రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విడదీసేసిన కేంద్రప్రభుత్వం ఉద్యోగులు, అధికారుల విభజన కష్టమని రైల్వేబోర్డు చెప్పటాన్ని ముఖ్య కారణంగా పరిగణించటం.