మోడీ హయాంలో .. రూ.8 లక్షల కోట్ల అప్పులు మాఫీ

Update: 2020-12-25 11:54 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అద్వర్యం లో , నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగుతున్న సమయంలో దాదాపు రూ.8 లక్షల కోట్ల నిరర్ధక అప్పులను వివిధ బ్యాంకులు మాఫీ చేశాయి. ఇదంతా 2015-19 మధ్య కాలంలోనే జరిగింది. 2004-14 మధ్య యూపీఏ హయాంలో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్‌ సర్దా అనే వ్యక్తి నిరర్ధక అప్పులపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా ఈ విషయం బయటపడింది.

ఎన్డీఏ హయాంలో 2015-19 మధ్యకాలంలో రూ.7,94,354 అప్పులను నిరర్ధక పద్దుల కింద గుర్తించారు. పదేళ్ల యూపీఏ హయాంలో రూ.2,20,328 కోట్ల రూపాయల పారు బకాయిలను బ్యాంకులు మాఫీ చేశాయి. కాగా బడా పరిశ్రమలు, ధనవవంతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకే పెద్దనోట్ల రద్దు చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు.
Tags:    

Similar News