అవినీతి ఆరోపణలు లేకున్నా.. అంతకు మించి అన్నట్లుగా అవసరం లేని చాలానే వివాదాలు నిత్యం మోడీ సర్కారును వెంటాడుతున్న పరిస్థితి. బీఫ్.. అసహనం..లాంటి అంశాలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు మోడీ విదేశీ పర్యటనల మీద కూడా చాలానే విమర్శలు వస్తున్నా.. దేశ ప్రజలు మాత్రం ఆయన సర్కారు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తాజాగా చేపట్టిన ఒక సర్వే తేల్చటం ఆసక్తికరంగా మారింది.
మోడీ పాలన బాగుందన్న కితాబుతో పాటు.. ఎబో యావరేజ్ మార్కులు రావటం విశేషం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 301 సీట్లలో ఎన్డీయే పక్షాలు గెలవటం ఖాయంగా చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 339 సీట్లతో దూసుకెళ్లిన ఎన్డీయే.. కేంద్రంలో సర్కారును ఏర్పాటు చేసింది. గడిచిన 21 నెలల వ్యవధిలో మోడీ పాలన పట్ల దేశ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఎబీపీ.. నీల్సన్ జరిపిన సర్వేలో వెల్లడైంది.
కాకుంటే సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన పరాజయం మూటగట్టుకొని డబుల్ డిజిట్ కు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి మాత్రం కాస్త బలం పుంజుకొని వంద సీట్ల మార్క్ ను దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజా సర్వే లెక్కల ప్రకారం దేశంలోని దక్షిణ భారతంలో మినహా మిగిలిన అన్నీ ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే కాస్త తక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంటోంది.
ఉత్తర ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే 134 సీట్లు సాధిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 113 సీట్లు మాత్రమే వస్తుందని లెక్క కట్టారు. అదే సమయంలో దక్షిణ భారతంలో సార్వత్రిక ఎన్నికల్లో 41 సీట్లు రాగా.. ఇప్పుడైతే అది 50కి పెరుగుతుందని తేల్చారు. ఇక.. తూర్పులో సార్వత్రిక ఎన్నికల్లో 57 సీట్లు రాగా.. తాజాగా ఎన్నికలు నిర్వహిస్తే 42 శాతానికి తగ్గుతుందని.. అదే పశ్చిమంలో అయితే సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన 107 స్థానాల నుంచి 96 స్థానాలకు తగ్గుతుందని తేల్చారు.