ఆడ-ఆడ.. మగ-మగ.. పెళ్లిళ్లను ఒప్పుకోం: కుండబద్దలు కొట్టిన మోడీ సర్కారు!!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన.. అంశాల్లో ఇది కూడా ఒకటి. ఒప్పుడు వరకట్నం వంటి సామాజిక అంశాల మాదిరిగానే ఇప్పుడు.. స్వలింగ సంపర్కుల(ఆడ-ఆడ, మగ-మగ) వివాహాలపైనా చర్చ సాగుతోంది. కొన్నాళ్ల కిందట తమిళనాడు అమ్మాయి.. బెంగళూరు అమ్మాయికి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అట్టహాసంగా శాస్త్రోక్తంగా పెళ్లి చేశారు. ఇక, రెండురోజుల కిందట.. తనకు వివాహం అయినప్పటికీ.. తన ప్రేయసిని మరిచిపోలేక పోతున్నానంటూ.. భార్య ఆమెతో వెళ్లిపోయింది. అదేవిదంగా యూపీలో పురుషుడు-పురుషుడు పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా గడవలేదు.
ఇలా దేశంలో స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు గత ఏడాది కాలంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. మరి వీటిని ప్రభుత్వం గుర్తిస్తుందా? గుర్తించదా? వారికి కూడా సర్టిఫికెట్ ఇస్తుందా? ఇవ్వదా? ఇదీ.. ఇప్పుడు ధర్మ సందేహం. ఈ విషయం తేల్చాలని.. ప్రభుత్వాన్ని గుర్తించేలా ఆదేశించాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. మరి సుప్రీం కోర్టు ఏం చేస్తుంది? వీటిని విచారణకు స్వీకరించింది. అయితే.. మరి కేంద్రం వాదన కూడా ముఖ్యమే కదా.. ఇదే విషయాన్ని కేంద్రాన్ని కోరింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై మీ అభిప్రాయం చెప్పండని కోరింది.
దీంతో తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు ఈ విషయంలో తాము ఒప్పుకొనేది లేదని తెగేసి చెప్పింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, భిన్న లింగ సంపర్కుల పెళ్లిళ్లు పూర్తిగా విరుద్ధమైనవని.. భారత కుటుంబవ్యవస్థతో పోల్చలేమని స్పష్టంచేసింది. వాటిని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
"వివాహం అనే కాన్సెప్ట్.. వ్యతిరేక లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య కలయికను సూచిస్తుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం వల్ల.. పెళ్లి అనే భావనను దెబ్బతీయకూడదు, నీరుగార్చకూడదు. అన్ని మతాలకు సంబంధించిన వ్యవహారాలను పర్సనల్ చట్టాలు చూసుకుంటాయి. ఆయా మతాలకు వర్తించే చట్టాల్ని బట్టి.. వివాహ స్వభావం భిన్నంగా ఉంటుంది. హిందువుల్లో పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం. మహిళ, పురుషుడు వారి పరస్పర విధులు నిర్వర్తించుకునే మతకర్మ.
కానీ, ఇస్లాంలో వివాహం మహిళ, పురుషుడి మధ్య ఒక ఒప్పందం. మతపరమైన, సామాజిక నిబంధనలతో లోతైన అవగాహనతో చేసిన శాసనపరమైన విధానాలను మార్చడానికి రిట్ పిటిషన్ వేయడం అనుమతించలేం. పర్సనల్ చట్టాలకు అనుగుణంగా పార్లమెంట్ వివాహ చట్టాలను రూపొందించింది. అవి.. మహిళ, పురుషుడి మధ్య వివాహనికి మాత్రమే చట్టపరమైన అనుమతి ఇస్తాయి'' అని వివరణ ఇచ్చింది. సో.. మరి దీనిపై సుప్రీం కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
పిటిషనర్ మన హైదరాబాదీనే!
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వారిలో హైదరాబాద్కు చెందిన అభయ్ దాంగ్, సుప్రియో చక్రవర్తి.. ఉన్నారు. వీరితో పాటు పార్థ్ ఫిరోజ్, ఉదయ్ రాజ్ అనే మరో స్వలింగ సంపర్కుల జంట కూడా ఇదే విషయమై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఒకే లింగానికి చెందిన వారనే కారణంతో ఇద్దరి వివాహానికి గుర్తింపు ఇవ్వకపోవడం.. రాజ్యాంగంలోని 14, 21వ అధికరణల కింద సమానత్వ హక్కును ఉల్లఘించడమేనని ఆయా పిటిషన్లలో వారు వాదించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.