కేంద్రం సంచలన నిర్ణయం

Update: 2019-08-26 12:12 GMT
అవినీతి గురించి ఆగస్టు 15 ప్రసంగంలో మోడీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మీడియా కవర్ చేసే ఈ ఈవెంట్ లో మోడీ ఇన్ కం టాక్స్ - కస్టమ్స్ డిపార్ట్ మెంట్లో అవినీతి జలగలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించడంలో అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే, మోడీ ఏదో వ్యూహం లేకుండా చేయరు. తన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజం చదువుతుందని తెలిసినా ఆరోజు ఆ మాటలు అన్నారంటే... కచ్చితంగా దానికో కారణం ఉంటుంది. ఆయన అన్న వ్యాఖ్యలు అప్పటికపుడు చర్యలు మొదలుపెట్టిన కేంద్రం అవినీతి పరులను గుర్తించి ఇంటికి పంపే ఏర్పాట్లు చేసింది.

కేంద్ర పరోక్ష పన్నులు - సుంకాల బోర్డు (సీబీఐసీ) 22 మంది అధికారులను అవినీతి కేసు కింద వేటు వేసింది. వెంటనే వారిని స్వచ్ఛంద విరమణ తీసుకోమని కోరింది. చట్టపరంగానే వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా సూపరింటెండెంట్ ర్యాంకు అధికారులే కావడం గమనార్హం. 56 జె ఫండమెంట్ రూల్ క్లాజ్ ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నారు. వీరంతా వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు. ఇప్పటికే 27 మంది ఐఆర్ ఎస్ - 12 మంది ఆదాయ పన్ను అధికారులను కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా... మోడీ అంతర్జాతీయ సమాజానికి భారతదేశపు అవినీతి వ్యతిరేక చర్యలను స్పష్టంగా తెలియజేయడానికే ఆరోజు ప్రసంగంలో ప్రస్తావని గాని - తదనంతరం తీసుకున్న చర్యలు గాని అని భావించొచ్చు.


Tags:    

Similar News