పౌర చ‌ట్టం.. మోడీకి మ‌రో మిత్ర‌ప‌క్షం ఝల‌క్!

Update: 2019-12-22 06:57 GMT
పౌర‌స‌త్వం చ‌ట్టం లో స‌వ‌ర‌ణ‌ల విష‌యంలో మోడీకి క్ర‌మంగా మ‌ద్ద‌తు త‌గ్గిపోతూ ఉంది. లోక్ స‌భ‌లో ఈ చ‌ట్టం ఆమోదం పొందిన నాటితో పోలిస్తే ఇప్పుడు ఎన్డీయే ప‌క్షాల్లో కూడా స‌పోర్ట్ క‌నిపించ‌డం లేదు. ఈ బిల్లును త‌మ ఓట్ల‌తో స‌మ‌ర్థించిన పార్టీలు ఇప్పుడు గొంతు స‌వ‌రించుకుంటున్నాయి. ఉత్త‌రాదిన‌ ఆందోళ‌న‌లు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డి పార్టీలు ఈ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా మాట్లాడానికి కూడా వెనుకాడటం లేదు.

ఇప్ప‌టికే బిహార్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఫ్రెండ్ నితీష్ కుమార్ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. త‌మ రాష్ట్రంలో పౌర‌స‌త్వం చ‌ట్టం స‌వ‌ర‌ణ‌లు చెల్ల‌బోవ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఎన్డీయేలో భాగ‌స్వామిగానే ఉన్నా నితీష్ కుమార్ ఆ చ‌ట్టం ప‌ట్ల అలా వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేశారు. త‌మ రాష్ట్రంలో ఆ చ‌ట్ట‌మే చెల్ల‌బోద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఎన్డీయే వ్య‌తిరేకం అయిన టీఎంసీ అధినేత్రి - బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఆ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌మ‌త లాగే నితీష్ కూడా మాట్లాడారు.

అయితే ఇప్పుడు మోడీకి ఈ విష‌యంలో మ‌రింత వ్య‌తిరేక‌త పెరుగుతున్న‌ట్టుగా ఉంది. ఈ చ‌ట్టంలోని స‌వ‌ర‌ణ‌ల‌ను పునఃస‌మీక్షించాల‌ని అంటోంది శిరోమ‌ణి అకాళీద‌ళ్. పంజాబ్ లోని ఆ పార్టీ ముస్లింల‌కు కూడా భార‌తీయ పౌర‌స‌త్వాల విష‌యంలో సానుకూలంగా ఉండాల‌ని మోడీకి స‌ల‌హా ఇచ్చింది.  ఇప్ప‌టికే త‌మ రాష్ట్రంలో ఈ చ‌ట్టం చెల్ల‌బోద‌ని పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌క‌టించేశారు. ఆయ‌నంటే కాంగ్రెస్ సీఎం. అక్క‌డ కాంగ్రెస్ వ్య‌తిరేకం అయిన అకాళీద‌ళ్ కూడా ఇప్పుడు ఈ చ‌ట్టం స‌వ‌ర‌ణ‌ల‌ను గ‌ట్టిగా స‌మ‌ర్థించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం!


Tags:    

Similar News