మూడేళ్ల మోడీ ప్ర‌చార వ్యయం...రూ.3755 కోట్లు

Update: 2017-12-09 04:27 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి అత్యంత ప్రీతిపాత్ర‌మైన ప్ర‌చారం విష‌యంలో షాకింగ్ వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ఒక‌టి కాదు రెండు కాదు..వంద‌లు కాదు...వేలు కాదు ఏకంగా రూ.3755 కోట్లు ఖ‌ర్చు చేశారు. మోడీజీ మూడున్న‌రేళ్ల ఏలుబ‌డిలో ప్రచారాని ఇంత‌మొత్తం ఖ‌ర్చు చేశార‌ని ఆర్టీఐ ద‌ర‌ఖాస్తులో తేలింది. కాగా, ప‌లు శాఖ‌ల‌కు చేసిన కేటాయింపుల‌కంటే ఎక్కువ‌గా ఈ మొత్తం ఉండ‌టం గ‌మ‌నార్హం.  37,54,06,23,616 మొత్తాన్ని ప్రింట్ మీడియా మ‌రియు ఔట్‌ డోర్ ప‌బ్లిసిటీ కోసం ఖ‌ర్చు చేశార‌ని కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఓ ఆర్టీఐ ద‌ర‌ఖాస్తులో వివ‌రించింది. గ్రేట‌ర్ నోయిడాకు చెందిన రామ్‌ వీర్ త‌న్వీర్ ఈ మేర‌కు ఆర్టీఐ ద‌ర‌ఖాస్తు చేయ‌గా ఈ సమాధానం ఇచ్చారు.

ఈ మొత్తంలో రూ.1,656కోట్ల‌ను ఎల‌క్ట్రానిక్  మీడియా ప్ర‌చారానికి వెచ్చించారు. క‌మ్యునిటీ రేడియో - డిజిట‌ల్ సినిమా - దూర‌ద‌ర్శ‌న్‌ - ఇంట‌ర్నెట్‌ - ఎస్ ఎంఎస్ మ‌రియు టీవీల‌కు ఈ మొత్తాన్ని ఖ‌ర్చుచేశారు. ప్రింట్ మీడియా కోసం రూ. 1698 కోట్లు ఖ‌ర్చు చేశారు. హోర్డింగ్ - పాంప్లెంట్లు మ‌రియు బుక్‌ లెట్లు రూ.399 ఖ‌ర్చు చేసిన‌ట్లు ఈ ఆర్టీఐ ద‌ర‌ఖాస్తుకు ఇచ్చిన వివ‌రణ‌లో తెలిపారు. కాగా, పలు ముఖ్యమైన శాఖ‌ల‌కు చేసిన కేటాయింపులు అర‌కొర‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. కాలుష్యంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చేసిన కేటాయింపులు కేవ‌లం రూ.56.8 కోట్లు కేటాయించ‌డం గ‌మ‌నార్హం. జూన్‌ 1 - 2014 మ‌రియు ఆగ‌స్ట్‌ 31 - 2016 మ‌ధ్య రూ.1,100 కోట్లు కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌చారం కోస‌మే కావ‌డం గ‌మ‌నార్హం.

కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ స‌వివ‌రంగా ఇచ్చిన ఈ స‌మాధానంలో జూన్ 1 - 2014 నుంచి మార్చి 31 - 2015 వ‌ర‌కు రూ.448 కోట్లు - ఏప్రిల్ 1 - 2015 నుంచి మార్చి 31 - 2016 వ‌ర‌కు రూ. 542 కోట్లు - ఏప్రిల్‌ 1 - 2016 నుంచి ఆగ‌స్టు 31 - 2016  రూ. 120 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని వెల్ల‌డించింది. ఇందులో టీవీ - ప్ర‌తిక‌ల వంటి ప్ర‌సార మాధ్య‌మాలు ఉండ‌గా..ఔట్ డోర్ ప్ర‌చారం గురించి లేదు. కాగా, 2015లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మమైన మ‌న్‌ కీబాత్‌ ప్ర‌చారం కోసం రూ. 8.5 కోట్లు చెల్లించిన‌ట్లు ఓ ఆర్టీఐ ద‌ర‌ఖాస్తుకు స‌మాధానం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News