మన ఇంట్లో మనిషి అన్నట్లుగా ప్రధాని మోడీ మాటలు ఉంటాయి. కానీ.. ఆయన వ్యవహారశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ప్రజలకు సన్నిహితంగా ఉండేలా నిత్యం ప్రయత్నించే మోడీ.. ప్రజల పక్షాన నిలిచే మీడియా విషయంలో మాత్రం కాస్తంత కటువుగానే ఉంటారు. ఆచితూచి.. ఎంపిక చేసిన సమయాల్లో మాత్రమే మీడియాను దగ్గరకు రానిస్తారు. అంతే తప్ప.. మీడియాతో క్లోజ్ గా ఉండటానికి ఏ మాత్రం ఇష్టపడరు. నమ్మలేకున్నా.. మోడీ విషయంలో ఇది నిజమని చెప్పక తప్పదు.
మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. తాను చెప్పాల్సిన విషయాన్ని మీడియా మీద ఆధారపడే ప్రయత్నం చేయరు. తన మాటలకు మీడియా ప్రచారం కల్పించినా.. కల్పించకున్నా.. ప్రజల వద్దకు వెళ్లే మార్గాన్ని ఇప్పటికే సెట్ చేసుకున్న మోడీ.. అందుకు తగ్గట్లే వివిధ మాధ్యమాల్ని తనకు తగ్గట్లుగా మార్చుకోవటం కనిపిస్తుంది.
తాజాగా ఇండియా టుడే ఛానల్ కు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన పెదవి విప్పటమే కాదు.. నోట్ల రద్దు నిర్ణయం యాభై రోజులు పూర్తి అయిన తర్వాత తొలిసారి ఒక మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వటం ఇదే తొలిసారి అని చెప్పక తప్పదు. మరీ ఇంటర్వ్యూలో మోడీ ఏం చెప్పారన్న విషయాన్ని చూస్తే.. తనను విమర్శిస్తున్న వారిని.. తన నిర్ణయాన్ని తప్పు పడుతున్న వారిపై పెద్ద ఎత్తున దాడి చేయటం కనిపిస్తుంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారి మాటల్లో ఏ మాత్రం పస లేదన్న విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. ఇంటర్వ్యూలో మోడీ మాటలు చూస్తే..
= విపక్షాలను చూస్తే జాలేస్తోంది. మిగిలిన రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ నాయకత్వం నిరాశ.. నిస్పృహలను బహిరంగంగానే వెళ్లగక్కారు. వారెప్పుడూ ఎన్నికల గురించి తప్పించి.. దేశం గురించి ఆలోచించరు. తొలిసారి విపక్షాలన్నీ ఏకమై.. అవినీతికి అనుకూలంగా పార్లమెంటు శీతాకాల సభా కార్యక్రమాల్ని స్తంభింపజేశాయి. సభ సజావుగా సాగేందుకు ప్రభుత్వం చాలానే చేసినా అవేమీ ఫలించలేదు.
= నోట్ల రద్దు నిర్ణయం ఘోరమైన తప్పిదం.. వ్యవస్థీకృత దోపిడీ అని మాజీ ప్రధాని మన్మోహన్ అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 45 ఏళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థలో కీలక సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటమా? ఆయన నోటి నుంచి వచ్చిన మాటలన్నీ ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు వాటి గురించేఅయి ఉంటుందని అనుకుంటున్నా(జీజీ.. బొగ్గు కుంభకోణాల్ని ప్రస్తావిస్తూ)
= నోట్ల రద్దు నిర్ణయంలో రాజకీయం ఏమీ లేదు. స్వల్పకాల రాజకీయ లబ్థి కోసం ఈ నిర్ణయం తీసుకోలేదు.
= ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థను.. సమాజాన్ని క్లీన్ చేసేందుకు మొదలు పెట్టిన ప్రయత్నం ఇది.
= అవినీతిని.. దోపిడీని పూర్తిగా అణిచివేసేందుకు తీసుకున్న కఠిన నిర్ణయం.
= నోట్ల రద్దు మా నీతి.. తప్పు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించటం మా రణనీతి. నల్లధనం ఉన్న వారు ఏకొత్త మార్గంలో వెళ్లినా వారిని వెతికి పట్టుకుంటాం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.
= దేశంలో ఆదాయపన్ను కట్టేవారు చాలా తక్కువగా ఉన్నారు. గతంలో ఐటీ అధికారులు లక్ష్యంలేకుండా దాడులు చేసేవారు. కానీ.. ఇప్పుడా శాఖ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లే వీలు ఉంటుంది. అవినీతిని సహించేది లేదు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా విడిచి పెట్టేది లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/