దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో మోదీ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. దాదాపుగా 85 రోజుల తర్వాత దేశంలో మళ్లీ గరిష్టంగా కేసులు నమోదయ్యాయి. సోమవారం 26,291 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 24,492 కేసులు నమోదు అయ్యాయి. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. వైరస్ వ్యాప్తి చెందడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సమాచారాన్ని వారి వద్ద నుంచి సేకరించారు.
ఈ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ - ఏపీ సీఎం జగన్ - ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరుపై కొంచెం అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే కరోనా వ్యాక్సిన్ పట్ల ఈ మూడు రాష్ట్రాల్లో వృధా అవుతోందని - తెలంగాణ - ఏపీల్లో 10 శాతం వరకు కరోనా వ్యాక్సిన్ వేస్ట్ అవుతోందనే సమాచారం తన వద్ద ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోనూ అదే స్థాయిలో వ్యాక్సిన్ వృధా అవుతోందని, దీన్ని తక్షణమే నివారించాలని సూచించారు. వ్యాక్సిన్ ఎందుకు 10 శాతం వరకు వృధా అవుతోందని ఆ ముగ్గురు ముఖ్యమంత్రులను మోడీ ప్రశ్నించారు. వ్యాక్సిన్ వృధాను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని మోడీ అన్నారు. దీనికోసం ప్రతిరోజూ సాయంత్రం వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించాలని, వ్యాక్సిన్ వేస్టేజీని అరికట్టడానికి వైద్యరంగంలో క్రియాశీలకంగా ఉండే అధికారులు, వ్యక్తులకు వాటి బాధ్యతను అప్పగించాలని సూచించారు.
అలాగే , కొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువగా వ్యాక్సినేషన్ సాగుతోందని, టెస్టింగులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా 70 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి చెందడాన్ని ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే.. దేశవ్యాప్తంగా అది విస్తరించడానికి ఎంతో సమయం పట్టదని హెచ్చరించారు. పాజిటివ్ కేసుల రేటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లల్లో అధికంగా ఉందని , ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు దీన్ని నివారించడానికి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. వైరస్ ప్రభావం అన్ని దేశాల పైనా ఉందని - పేద-ధనిక - ఉత్తరం-దక్షిణం - తూర్పు-పడమర అనే తేడా ఏదీ లేదని అన్నారు. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేశారు. దీనికోసం నిర్ణయాత్మక అడుగులు వేయాలని చెప్పారు. ప్రభావవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్ - సూక్ష్మ కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాలని సీఎంలకు ప్రధాని సూచించారు.