దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరం రాశారు. ప్రధానిగా ఏడాది పాలన పూర్తైన సందర్భంగా మోడీ ఈ బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, సాధించిన విజయాలను మోడీ తన లేఖలో ఏకరవుపెట్టారు. %''%నా ప్రియమైన దేశ ప్రజలారా...%''% అంటూ ప్రారంభించిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో దేశంలోని నిరుపేదలు, ప్రజలు, రైతులు, కార్మికులు తన కళ్లముందు కనిపిస్తారని, అందువల్లే జన్‌ధన్ యోజన, అటల్ పెన్షన్, ప్రధానమంత్రి జీవన జ్యోతి తదితర పథకాలను ప్రవేశపెట్టానంటూ సెంటిమెంటు పండించారు. అయితే... ఆయన గత ఎన్నికల ముందు దేశంలో విస్తారంగా తిరుగుతూ ప్రచారం చేసినప్పుడు అదేపనిగా ఊకదంపుడు ఉపన్యాసాల్లో చెప్పిన విషయాలనే ఈ లేఖలోనూ దాదాపుగా చెప్పారు. చేసినవి, చెయ్యనివీ.... మాట నిలుపుకొన్నవి... పక్కకు తప్పుకొన్నవీ అన్నీ ఇందులో పేర్కొన్నారు. ఆయన రాసిన ఈ తాజా లేఖ చూస్తే ఎన్నికల ముందు నాటి ఆయన ఎన్నికల ప్రసంగంలోని హామీలు, బీజేపీ మేనిఫెస్టోయే మళ్లీ కళ్ల ముందు కనిపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అతివృష్టి, అనావృష్టి వల్ల ఇబ్బందులు పడుతున్న అన్నదాతకు నిత్యం అండగా ఉంటామని... రైతుల పరిహారాన్ని తాము ఒకటిన్నర రెట్లు పెంచామని మోడీ తన లేఖలో వివరించారు. గత ప్రభుత్వ పాలనలో బగ్గు, స్పెక్ట్రమ్ పంపిణీ వంటి విషయాల్లో ఇష్టానుసారం వ్యవహరించారని, తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వేలం విధానంలో కేటాయింపులు జరిపిందని చెప్పుకొచ్చారు. బగ్గు గనుల వేలం ద్వారా రూ. 3 లక్షల కోట్లు, స్పెక్ట్రం వేలం ద్వారా రూ. 1లక్ష కోట్లను ఖజానాకు చేర్చిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదేనని మోడీ తన లేఖలో పేర్కొన్నారు.
మోడీ తన లేఖలో..... %''%మేకిన్ ఇండియా%'', ''%స్కిల్ ఇండియా%''% వంటి పథకాల ద్వారా యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను దగ్గర చేశామని అన్నారు. ముద్రా బ్యాంకు ఏర్పాటుతో చిన్న, మధ్యతరహా కంపెనీలకు రూ. 10 లక్షల వరకూ బ్యాంకు రుణాలను ఇచ్చేలా ఏర్పాటు చేశామని అన్నారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారిని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు కొత్త చర్యలు చేపట్టామని అన్నారు. దేశాన్ని క్లీన్ ఇండియా మార్చేందుకు గాను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. %''%భేటీ పడావో, భేటీ బచావో%''% అన్న నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి 24గంటలు కరెంట్‌తో పాటు రోడ్డు, రైలు మార్గం, %''%డిజిటల్ కనెక్టివిటీ%''%తో అనుసంధానం చేస్తామని తెలిపారు. తూర్పు ఇండియాని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్మార్ట్ సిటిల్లో ఇల్లులేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని తెలిపారు.
లేఖ ముగింపులో మరోమారు ప్రజలను దువ్వే ప్రయత్నం చేస్తూ స్నేహితులారా అని సంబోధిస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే. జీవిత నాణ్యత, సరైన సేవలను అందించడమే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మొత్తానికి ఊకదంపుడు విషయాలే చెప్పినప్పటికీ ప్రజలే నా కళ్ల ముందు కనిపిస్తున్నారు అంటూ స్నేహితులారా అని సంబోధిస్తూ ఆకట్టుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.