ఇష్టమని చెప్పి వెళ్లిపోయిన మోడీ

Update: 2016-02-08 04:07 GMT
ఏపీకి వచ్చిన ప్రధాని మోడీ రెండు రోజులపైనే ఉన్న విషయం తెలిసిందే. విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శనకు వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని గంటల తరబడి వీక్షించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తరలి వచ్చిన నౌకా దళాల అద్భుత ప్రదర్శనను స్వయంగా వీక్షించిన ఆయన.. విశాఖ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. హుధూద్ విపత్తు నుంచి ఈ నగరం చాలా త్వరగా బయటపడిందని.. ఇక్కడి ప్రజలు ఎంతో ధైరంగా తేరుకున్నారని వ్యాఖ్యానించారు.

మరి మోడీకి ఎంతో ఇష్టమైన విశాఖ నగరానికి ఏం చేసినట్లు? ఇష్టమైన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తారు. అదేం చిత్రమో కానీ.. ప్రధాని మోడీ ఇష్టమని చెబుతారే కానీ.. అందుకు తగినట్లుగా చేతలు మాత్రం ఉండవు. మాటల్లో ఇష్టం చూపించే ప్రధాని మోడీ కారణంగా ఏపీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్న విషయం మర్చిపోకూడదు. మాటల్లో కాకుండా.. చేతల్లో ఇష్టం చూపిస్తే మంచిది అలాంటి మోడీని మనం చూసే అవకాశం ఉందా..?
Tags:    

Similar News