పిఎం కిసాన్ డబ్బులు.. రైతులకు మోడీ ట్విస్ట్

Update: 2019-12-11 07:33 GMT
తెలంగాణలో హిట్టయిన రైతుబంధును కేంద్రంలోని మోడీ సర్కారు ‘పీఎం కిసాన్’ పేరుతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.. తద్వారా రెండోసారి కూడా మోడీ అధికారంలోకి వచ్చేశారు. అయితే ఇప్పుడు  పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో పడాలంటే కొత్త మెలిక పెడుతున్నాడు.

పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులందరూ తమ అకౌంట్లలో డబ్బులు పడాలంటే ఇక బ్యాంకు ఖాతాకు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాల్సిందే.. చేసుకోకపోతే ఇక నుంచి డబ్బులు పడవని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్ సభలో తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏడాదికి 6వేల చొప్పున దేశంలోని 14 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. ఇక నుంచి డబ్బులు పడాలంటే రైతులు ఖచ్చితంగా ఆధార్ ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 30వరకే దీని గడువు ముగిసింది. ఇక నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్ లింక్ ఉన్న వారికే డబ్బులు పడుతాయని కేంద్రం తెలిపింది.
Tags:    

Similar News