ప్రభుత్వానికి ఆదాయం కావాలి. అందుకు ఉన్న మార్గం ఒక్కటే సంపాదించటం. అది చేతకానప్పుడు పన్నులు వేస్తారు. అది కూడా సరైన ఆప్షన్ కాదన్నప్పుడు.. ప్రభుత్వం దగ్గరి ఆస్తుల్ని ఎడాపెడా అమ్మేయటం.. లేదంటే దీర్ఘకాలానికి లీజులు ఇవ్వటం. ఆస్తుల్ని అమ్మేస్తే.. భవిష్యత్ తరాలకు ఇచ్చేది చిప్పే. లీజుకు ఇస్తే.. దేశ ప్రజల నడి విరిగేలా బాదుడు. అందుకే.. పూర్తిగా అమ్మకాలు చేపట్టకుండా.. అలా అని ఊరుకోకుండా.. అటు అమ్మకం.. ఇటు లీజుకు ఇచ్చే ప్రోగ్రాంకు తెర తీశారు మోడీ వారు.
కుంభకోణాలు లేని స్వచ్ఛమైన పాలనను అందించే మోడీ వారికి.. లీటరు పెట్రోల్ రూ.వంద దాటించేసి.. లీటరు డీజిల్ ను రూ.100కు దగ్గరగా తెచ్చేసినప్పటికి ఆదాయాన్ని మరింతగా పెంచుకునే దాహం మాత్రం తీరట్లేదు. అందుకే.. రూ.6లక్షల కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు మోడీ సర్కారు వేసిన ప్లాన్ అంతా ఇంతా కాదు. పలు రంగాల్ని గుర్తించి. అందులోని ఆస్తుల్ని ఎడాపెడా లీజుకు ఇచ్చేయాలని డిసైడ్ చేసింది.
ప్రభుత్వానికి ఆదాయం లేని ఆస్తులు.. ప్రైవేటు రంగంలోకి వెళ్లినంతనే ఆదాయం ఎలా వస్తుంది? అన్న సందేహం వచ్చిందా? అదే మేజిక్. ప్రభుత్వం చేతకానిది.. ప్రైవేటుకు చేతనయ్యేది ఏమీ ఉండదు. ప్రభుత్వం చూసిచూడనట్లుగా బాదితే.. ప్రైవేటు నిర్మోహమాటంగా బాదేస్తారు. రిలయన్స్ జియో సంగతే చూడండి. మొదట్లో డేటా వినియోగానికి సంబంధించి ఇచ్చిన ఆఫర్ కు.. ఇప్పుడు పెంచిన వైనాన్ని చూడండి. గతంలో సెల్ ఫోన్ ను తక్కువగా వాడేవాళ్లకు.. మినిమం అమౌంట్ రీఛార్జి చేసుకుంటే సరిపోయేది. అది చాలా చాలా తక్కువ మొత్తంలో ఉండేది. ఇప్పుడు మీరు వాడతారా? లేదా? అన్నది తర్వాతి విషయం.. నెల తిరిగేసరికి రీఛార్జి తప్పనిసరి. గతంలో లేనిది ఇప్పుడే ఎందుకంటే.. అదే ప్రైవేటు మాయ.
ఇప్పుడు మోడీ సర్కారు వివిధ రంగాలకు చెందిన ఆస్తుల్ని లీజుకు ఇచ్చేయటం ద్వారా భారీ ఎత్తున నగదును చేతుల్లోకి తెచ్చుకోవాలని భావిస్తోంది. ప్రైవేటు చేతికి వెళ్లిన ప్రభుత్వ ఆస్తులతో మరింత సంపాదించకుండా ఎందుకు ఉంటారు? గతంలో ప్రభుత్వ ఆస్తుల లీజుకు సంబంధించి కొన్ని మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ విషయంలో మొహమాట పడకుండా టెలికాం.. గ్యాస్ లైన్లు.. రోడ్లు.. రైల్వేలు.. విద్యుత్ సరఫరా.. విద్యుదుత్పత్తి.. ఇలా ఒకటి కాదురెండు కాదు అవకాశం ఉన్న ప్రతి రంగాన్ని ప్రైవేటుకు ఇచ్చేందుకు మోడీ సర్కారుప్లాన్ చేసింది.
దీంతో.. ప్రతి విషయానికి సంబంధించి ఇప్పటితో పోలిస్తే.. భవిష్యత్తులో ఖర్చు పెరగటం ఖాయం. ఇక.. మోడీ సర్కారు ప్లాన్ చేస్తున్న వివిధ రంగాలకు సంబంధించి ఎంతెంత మొత్తాన్ని సమీకరించాలని భావిస్తున్నారన్నది లెక్క చూస్తే..
- రోడ్ల మీద రూ.1.60 లక్షల కోట్లు. ఇందుకోసం 26,700కి.మీ. నేషనల్ హైవేల్ని లీజుకు ఇవ్వనున్నారు
- రైల్వేలకు సంబంధించి స్టేషన్లు.. ప్యాసింజర్ రైళ్లు.. రైల్వే ట్రాక్.. ఇలా ఒకటేమిటి ఏం అవకాశం ఉంటే దాన్ని ప్రైవేటుకు అప్పగించనున్నారు. దీని ద్వారా రూ.1.52లక్షల కోట్లు తీసుకురావాలని భావిస్తున్నారు.
- విద్యుత్ సరఫరాను ప్రైవేటుకు అప్పగించటం ద్వారా రూ.45,200 కోట్ల ఆదాయానికి ప్లాన్ చేశారు.
- విద్యుదుత్పత్తికి సంబంధించి ప్రైవేటుకు లీజుకు ఇవ్వటం ద్వారా రూ.39,832 కోట్లు ఖజానాకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
- గ్యాస్ పైప్ లైన్లను కూడా లీజుకు ఇచ్చేయటం ద్వారా రూ.24.462 కోట్లను.. ప్రొడక్ట్ పైప్ లైన్ల ద్వారా రూ.22,504 కోట్లను ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.
- బీఎస్ఎల్ఎన్ కు చెందిన 14,917 టవర్లను.. 2.86 లక్షల కిలోమీటర్ల భారత్ నెట్ ఫైబర్ నెట్ వర్కును ప్రైవేటుకు అప్పగించటం ద్వారా రూ.35,100 కోట్లను తీసుకురావాలన్నది ప్లాన్.
- గిడ్డంగుల ద్వారా రూ.28,900 కోట్లు.. మైనింగ్ ద్వారా రూ.28,747 కోట్లు.. ఎయిర్ పోర్టుల ద్వారా రూ.20,782 కోట్లు.. నౌకాశ్రయాల ద్వారా రూ.12,828 కోట్లు.. ఆట స్థలాల ద్వారా రూ.11,450 కోట్లు.. అర్బన్ రియల్ ఎస్టేట్ ద్వారా రూ.15వేల కోట్లను సమీకరించాలని భావిస్తున్నారు. అదండి సంగతి. మొత్తానికి మోడీవారి రెండో టర్మ్ పూర్తి అయ్యేసరికి.. చుట్టూ ఏది చూసినా.. ప్రైవేట్.. ఫ్రైవేట్ అన్న బోర్డులే కనిపిస్తాయేమో?