వీలైనప్పుడల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద తన భక్తిని గౌరవాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాటుకుంటూనే ఉంటారు. మోడీ పుట్టిన రోజున ఇతర ముఖ్య సందర్భాలలో ఆయన ట్వీట్లు కూడా వేస్తారు. మోడీ కలవాని పిలిస్తే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విమానం రెక్కలు కట్టుకుని విశాఖలో వాలిపోయారు. ఇక ఈ మధ్య మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగులో కూడా మోడీ అంటే తనకు గౌరవం అని పవన్ చెప్పుకున్నారు.
ఇలా ప్రధాని విషయంలో పక్కా క్లారిటీగా ఉండే పవన్ కళ్యాణ్ కి బీజేపీతో మైత్రి విషయంలో మాత్రం కొంత అయోమయం ఉంది అని అంటున్నారు. ఏపీ బీజేపీతో కలసి ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్న దాని మీద జనసేనలో చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయని అంటున్నారు. విశాఖ వచ్చిన మోడీ తాను స్వయంగా పవన్ని పిలిపించుకుని అరగంటకు పైగా మాట్లాడారు. ఓక్ విధంగా బీజేపీ నుంచి మోడీ నుంచి కచ్చితమైన హామీ వచ్చి ఉంటుందని అంతా అనుకున్నారు.
మోదీతో బాగానే ఉంటున్న పవన్ ఏపీ బీజేపీ నేతలతో మాత్రం గ్యాప్ ఉందన్నట్లుగా వ్యవహరిస్తారు. నిజానికి బీజేపీకి జనసేనకు మధ్య గ్యాప్ లేకుండా చూడడం కోసం తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పవన్ సైతం కరోనా వల్ల భౌతికంగా కొంత గ్యాప్ వచ్చింది తప్ప మరేమీ కాదని చెపారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు కరోనా తగ్గినా కూడా రెండు పార్టీలు వేటికవే అన్నట్లుగా కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నాయి.
పవన్ వైపు నుంచి చూస్తే ఆయన వీకెండ్ టూర్స్ చేస్తూ రైతు భరోసా కార్యక్రమాలను చేస్తూ తన అజెండాను తాను ఫాలో అవుతున్నారు. ఎక్కడా బీజేపీ పేరుని కూడా ప్రస్తావించడంలేదు. అదే బీజేపీ నేతలు మాత్రం జనసేనతో కలసి పోటీ చేస్తామని మాటలలో చెబుతున్నారు కానీ చేతలలో ఉమ్మడి కార్యాచరణ కనిపించడంలేదు. ఇదిలా ఉండగా విజయవాడలో బీజేపీ జనసేన నాయకులు ఇద్దరూ కలసి మీటింగ్ ఏర్పాటు చేస్తారని, ఈ సందర్భంగా ఒక అజెండా సెట్ చేసుకుని ముందుకు వెళ్తారని వార్తలు వచ్చాయి.
అయితే ఇపుడు అది కూడా లేదు అన్నట్లుగా తెలుస్తోంది దీని మీద జనసేన ఉలిక్కిపడి మరీ భేటీలు మీటింగులు లాంటివేవీ లేవని చెప్పేసింది. జస్ట్ వాజ్ పేయి సుపరిపాలన మీద బీజేపీ మీటింగ్ అంటే తమ పార్టీకి చెందిన ఇద్దరు ప్రతినిధులను పంపుతామని అంటోంది. మొత్తంగా చూస్తే విషయం ఇదన్న మాట. అంటే పవన్ని ఏదో మీటింగ్ పేరుతో పిలిచి కో ఆర్డినేషన్ కమిటీని వేసి ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
కానీ జనసేన మాత్రం ఇపుడేమి తొందర అన్నట్లుగా ఉందని చెబుతున్నారు. దానికి కారణం ఏపీ బీజేపీతో ముందుకు సాగే విషయాన్ని జనసేన నేతలు ఎటూ తేల్చుకోలేకపోతూండడమే అంటున్నారు. దాని వల్లనే ఇలా అంటున్నారు. మోడే మీటింగ్ లో పవన్ కి ఏమి చెప్పారో దాని మీద జనసేనకు ఎంత వరకూ గురి ఉందో తెలియదు కానీ పెద్దాయన మోడీని గౌరవిస్తామంటూనే బీజేపీకి దూరం అంటోంది అని చెబుతున్నారు. మరి దీన్ని చూసిన వారు మాత్రం జనసేన బీజేపీ మైత్రి కొనసాగుతుందా అనే డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.