పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో జరిగే ఎన్నికల వైపే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కర్ణాటకలో బీజేపీ - కాంగ్రెస్ ల జయాపజయాలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - ఛత్తీస్ గఢ్ - మిజోరం అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. కర్ణాటక ఫలితాల ఆధారంగానే 2019 లోక్ సభ ఎన్నికలలో కూటములు - వ్యూహాలు రూపొందనున్నాయి. ఒకవేళ కర్ణాటకలో ఓటమి పాలైతే బీజేపీ ముందస్తుగా లోక్ సభ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ రకంగా చూసినా కన్నడిగుల తీర్పు రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్ని గణనీయంగా ప్రభావితం చేయనుంది. ఇటు కాంగ్రెస్ కు అటు బీజేపీకి కీలకంగా మారనుందని చెప్తున్నారు.
ఇటీవల జరిగిన లోక్ సభ ఉపఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో పడిపోయిన బీజేపీ శ్రేణులలో ఉత్సాహం నింపేందుకు కర్ణాటకలో విజయం సాధించితీరాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమి పాలైతే ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారగలదని పరిశీలకులు భావిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిగిలిన ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా - కమలనాథుల జైత్రయాత్రను అడ్డుకొని ఈ ఎన్నికల నుంచి తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక మూడో పక్షంగా ఉన్న జనతాదళ్ (ఎస్) మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కనీసం హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తాము కింగ్ మేకర్లు కావచ్చని ఆ పార్టీ అధ్యక్షుడు - మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ ఆశిస్తున్నారు. గత 11 ఏళ్లుగా అధికారానికి దూరంగా జేడీ(ఎస్) ఈసారి కూడా ప్రాధాన్యంగల పాత్రను పోషించలేకపోతే ఇక తెరమరుగు కావాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక ఫలితాలు అటు బీజేపీకి - కాంగ్రెస్ కే కాకుండా పలు పార్టీల రాజకీయ వైఖరులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
అయితే, కన్నడ ప్రజానీకం గత మూడు దశాబ్దాలలో ఏ పార్టీకి రెండోసారి మళ్లీ అధికారాన్ని అప్పగించలేదు. 1989 నుంచి వరుసగా ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ సంప్రదాయం తమకు కలిసి వస్తుందని బీజేపీ ఆశిస్తోంది. కానీ ఈ చరిత్రను తిరగరాస్తానని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిద్దరామయ్య సర్కార్ పట్ల ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని ఇటీవల కొన్ని స్వతంత్ర సంస్థలు నిర్వహించిన సర్వేలలో వెల్లడైంది. దీంతో ఇంతకాలం తమ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పపై ఆధారపడిన బీజేపీ గత మూడు నెలల నుంచి తమ కేంద్ర నాయకత్వాన్ని - జాతీయ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నది. యడ్యూరప్పను జేడీ(ఎస్) మోసం చేసిందన్న సానుభూతితో 2008లో బీజేపీ గెలుపొందింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని చూపించి 2013లో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. ఈసారి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంక్ కు గండి కొట్టే ఎత్తుగడలో భాగంగా ఇటీవల ఆయన లింగాయత్ లు - వీరశైవులకు మతపరమైన మైనారిటీ హోదాను ప్రకటించారు. తన ప్రజాకర్షక పథకాల ద్వారా సిద్దరామయ్య దళితులు - బీసీలు - మైనారిటీలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ, వాటితో సిద్దరామయ్యకు సంబంధం ఉన్నట్టు నిరూపించలేక పోయిన బీజేపీ ఈ ఎన్నికలను సిద్దరామయ్య - మోడీకి మధ్య పోరుగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది.