పేరుకు విదేశాంగ మంత్రే కానీ.. ఆ శాఖమంత్రిగా పూర్తి స్థాయిలో స్వతంత్రం అనుభవించలేకపోతోంది సుష్మాస్వరాజ్. ఒకదశలో భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం పొందిన సుష్మాస్వరాజ్ మోడీ తెరపైకి వచ్చే సరికి వెనుకబడిపోయారు. మోడీ ప్రధానమంత్రి పదవిని అధిష్టించగా ఆమె విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మోడీ ప్రభుత్వం ఏర్పాటవుతూనే.. విదేశాలతో భారత సంబంధాలపై ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేసింది. ఇలాంటి నేపథ్యంలో సుష్మాస్వరాజ్ కు బాధ్యతలు పెరిగి ఆమె ప్రభ పెరగాల్సింది. అయితే అది జరగలేదు.
ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విదేశాల పర్యటనలు ఎక్కువగా వెళుతున్నారు. విశేషం ఏమిటంటే.. ఆ పర్యటనల్లో విదేశాంగ మంత్రికి స్థానం లేకుండా పోతోంది!
సాధారణంగా భారత ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు వెళుతున్నప్పుడు ఆయన వెంట విదేశాంగశాఖ మంత్రి ఉండటం ఆనవాయతీ. ప్రతిసారీ కాకపోయినా ఎక్కువసార్లు ప్రధాని వెంట విదేశాంగ శాఖ మంత్రి ఉంటారు.
కానీ మోడీ హయాంలో మాత్రం అది జరగడం లేదు. ఇప్పటి వరకూ తను చేపట్టిన విదేశీ పర్యటనల్లో ఎప్పుడు కూడా సుష్మాస్వరాజ్‌ను మోడీ వెంట తీసుకెళ్లలేదు.
అధికారులను వెంటపెట్టుకెళ్లే మోడీ విదేశాంగ శాఖ మంత్రికి మాత్రం ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఇంకా విడ్డూరం ఏమిటంటే... మోడీ విదేశీ పర్యటనలు పూర్తి చేసుకొని వస్తే.. ఆయనకు సుష్మాస్వరాజ్ వెళ్లి స్వాగతం పలికిన సందర్భాలున్నాయి!
ప్రధాని విదేశాలకు వెళ్లి వస్తే.. విదేశాంగ మంత్రి వెళ్లి స్వాగతం పలకడం నిజం గా విడ్డూరమే! ఇలాంటి నేపథ్యంలో నరేంద్రమోడీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. యూరప్, ఉత్తరమెరికా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఆయన పర్యటించనున్నాడు. మరి ఈసారైనా సుష్మను వెంటతీసుకెళ్లి ఆమెను సంతోషపెడతాడా.. లేక తనే విదేశాంగమంత్రిగా వ్యవహరిస్తాడో చూడాలి!