ప్రపంచానికే పెద్దన్న అయిన ఒబామా కంటే భారత ప్రధాని ధైర్యవంతుడా? రిస్క్ తీసుకోవటానికి వెనుకాడరా? అగ్ర నేతల్ని సైతం అలెర్ట్ గా ఉంచే చైనా నిఘా వర్గాల విషయాన్ని మోడీ లైట్ గా తీసుకుంటున్నారా? లాంటి ప్రశ్నలు వేసుకుంటే కాస్త ఆసక్తికరమైన సమాధానాలు లభించకమానవు.
దేశాధినేతలు తమ విదేశీ పర్యటనల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా ప్రధాని మోడీ తన అమెరికా పర్యటనలో బస చేయాలనుకుంటున్న హోటల్ విషయం ఇప్పుడు చర్చగా మారింది. న్యూయార్క్ లోని ప్రసిద్ధ వాల్ డార్ఫ్ అస్టోరియా హోటల్లో బస చేసేందుకు భారత అధికారులు ఓకే చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే..ఈ హోటల్ లో బస చేసేందుకు అమెరికా అధ్యక్షుడు సైతం నో చెప్పటమే దీనికి కారణం.
ఒబామా నో చెప్పటానికి సరైన కారణమే ఉంది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ నుంచి దేశ రక్షణ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని చైనా సైబర్ నేరగాళ్లు తస్కరించటం.. అస్టోరియా హోటల్ ను 2014లో చైనాకు చెందిన బీమా కంపెనీ కొనుగోలు చేయటం.. లాంటి కారణాలతో పాటు.. చైనా యాజమాన్యంలో ఉన్న హోటల్ లో తమ భద్రత విషయంలో ఉన్న సందేహాలే ఒబామా బస చేయకుండా ఉండటానికి కారణాలుగా చెబుతుంటారు.
దీనికి భిన్నంగా తన తాజా పర్యటనలో మోడీ అలాంటి భయాలేమీ పెట్టుకోకుండా సెప్టెంబరు 23 నుంచి 28 వరకు అమెరికాలోనే బస చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరంగా మోడీతో పాటు.. ఇదే హోటల్ లో బస చేయటానికి రష్యా అధినేత పుతిన్ సైతం బుక్ చేసుకోవటం గమనార్హం. ఇక.. యూఎన్ జీఏ ఉన్నతస్థాయి సమావేశాల కోసం న్యూయార్క్ రానున్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సైతం ఇదే హోటల్లో బస చేయనుండటం విశేషం. మరింతమంది దేశాధినేతలు (చైనా మినహాయిస్తే) బస చేసేందుకు మక్కువ చూపిస్తున్న అస్టోరియాలో ఒబామా మాత్రం ససేమిరా అనటం కాస్తంత చిత్రమైన విషయమే. ఎందుకైనా మంచిది.. పెద్దన్నే నో చెప్పారంటే.. మోడీ అండ్ కో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుందేమో.