గూగుల్ ఈ మ‌ధ్య నీకేమ‌వుతోంది?

Update: 2018-04-26 08:11 GMT
చ‌ద‌వేస్తే ఉన్న మ‌తి పోయింద‌న్న సామెత‌ను గుర్తుకు తెస్తోంది గూగుల్‌. ప్ర‌ఖ్యాత సెర్చింజ‌న్ గా పేరున్న గూగుల్ ఇటీవ‌ల చేస్తున్న త‌ప్పులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గూగుల్ సెర్చిలోకి వెళ్లి కొన్ని ప్ర‌శ్న‌ల‌కు అదిస్తున్న స‌మాధానం ఇప్పుడు వార్త‌గా మారింది.

ప్ర‌శ్న ఏదైనా స‌రే.. స‌మాధానం సిద్ధ‌మ‌న్న‌ట్లుగా ఉండే గూగుల్ సెర్చింజిన్ అప్పుడ‌ప్పుడు చేసే త‌ప్పులు కామెడీగా మార‌ట‌మే కాదు.. స‌ద‌రు కంపెనీకి చికాకులు.. వ్యంగ్య‌స్త్రాలు సంధించేలా చేస్తోంది. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి భార‌తదేశ తొలి ప్ర‌ధాని ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా నెహ్రు అన్న స‌మాధానం స‌రిగానే వ‌చ్చినా.. వ‌చ్చిన ఫోటో పుణ్య‌మా అని గూగుల్ ను ప‌లువురు గురి పెట్టేస్తున్నారు.

పేరు స‌రిగానే వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఫోటో మాత్రం ప్ర‌ధాని మోడీది రావ‌టంపై ప‌లువురు స‌టైర్లు వేస్తున్నారు. దేశ తొలి ప్ర‌ధాని అన్న ప్ర‌శ్న‌కు మోడీ ఫోటో రావ‌టంపై గూగుల్ ను ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.  ప‌లువురు నెటిజ‌న్లు ఈ త‌ప్పును స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేస్తుండ‌టంతో ఇదో వైర‌ల్ గా మారింది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ పోస్టింగ్ తో అలెర్ట్ అయిన గూగుల్ టీం ఈ త‌ప్పును స‌రిదిద్దుకుంది.  గూగుల్ సెర్చింజ‌న్ స‌మాధానంపై కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా వింగ్ ప్ర‌తినిధి దివ్య రియాక్ట్ అవుతూ..గూగుల్ ఇండియా ఏ ప్రాతిప‌దిక‌న ఇలా చేశారంటూ ప్ర‌శ్నించారు. మ‌రోవైపు ప్ర‌ముఖ జాతీయ ఛాన‌ళ్ల‌లో కూడా ఈ త‌ప్పిదంపై క‌థ‌నాలు టెలికాస్ట్ అయ్యాయి. మొత్తంగా గూగుల్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.
Tags:    

Similar News