భారీగా నమోదవుతున్న కరోనా కేసులతో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. మాయదారి రాజకీయం తన వంతు పాత్ర పోషిస్తోంది. కరోనాకు చెక్ పెట్టే అవకాశం ఉన్నవ్యాక్సిన్ పంపిణీ మీద మోడీ సర్కారు అనుసరిస్తున్న తీరును పలు రాష్ట్రాలు తప్పుపడుతున్నాయి. ఆ మాటకు వస్తే.. వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున తయారు చేసే దేశంలో.. టీకా కొరత ఏమిటని మండిపడుతున్న వారు లేకపోలేదు. ముందు మన సంగతి చూసుకోకుండా.. విదేశాలకు మన వ్యాక్సిన్ పంపాల్సిన అవసరంఏమిటని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు.
మొత్తంగా వ్యాక్సినేషన్ మీద మోడీ సర్కారు పాలసీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సమర్థించే వారి స్థానే.. విమర్శించే వారు.. వేలెత్తి చూపించేటోళ్లు ఎక్కువ అవుతున్న పరిస్థితి. ఇది సరిపోదన్నట్లుగా కొన్ని విపక్షాలు సంధిస్తున్న విమర్శనాస్త్రాలు మోడీ సర్కారును ఇరుకున పడేలా మారాయి. గడిచిన కొద్దిరోజులుగా కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న లొల్లి తెలిసిందే.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనకు.. బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయే పరిస్థితి. తమ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తికి కేంద్రం కారణమని.. తమకు సరైన సహకారం అందించటం లేదని మహా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మండిపడుతున్నారు. తమ రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లు.. ఆక్సిజన్.. రెమిడిసివర్ ఇంజెక్షన్ల సరఫరా చేయటం లేదని కేంద్రాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలోని సేన సర్కారు దారుణ వైఫల్యంతోనే తాజా పరిస్థితి నెలకొందన్న ప్రతి విమర్శ చేస్తోంది బీజేపీ. ఈ మాటల యుద్ధం సరిపోదన్నట్లుగా తాజాగా మహా మంత్రి లేవదీసిన పాయింట్ ఒకటి సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా.. టీకా వేసుకున్న వారికి సర్టిఫికేట్ ఇవ్వటం తెలిసిందే. దీనిపై ప్రధాని మోడీ ఫోటో ఉండటాన్ని మహారాష్ట్ర మంత్రి..ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పై ప్రధాని మోడీ ఫోటో ఉండటాన్ని తప్పు పట్టారు.
వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద మోడీ ఫోటో ఉన్నప్పుడు.. కరోనా కారణంగా మరణించిన వారి డెత్ సర్టిఫికేట్ మీద కూడా ఆయన ఫోటో ఉండాలి కదా? అని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దేశంలో ఎన్ని టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది? మహారాష్ట్రకు ఎంత పంపుతున్నారు? బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. నవాబ్ మాలిక్ వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది.