బాబు మ‌న‌మ‌డితో మోడీ ఆట‌!

Update: 2015-10-22 07:10 GMT
అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీ వ‌చ్చేశారు. గ‌న్న‌వ‌రం చేరుకున్న ఆయ‌న‌.. ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ లో అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మ స్థ‌లి వ‌ద్ద‌కు చేరుకున్నారు. హెలికాఫ్ట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న ప్ర‌త్యేక వాహ‌నంలో వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్ ను సంద‌ర్శించేందుకు వ‌చ్చిన మోడీకి.. బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రిచ‌యం చేశారు.

ఈ సంద‌ర్భంగా బాబు కుమారుడు లోకేశ్ చేతిలో ఉన్న చిన్నారి దేవాన్ష్ ను మోడీ ముద్దు చేశారు. చిన్నారిని చూసిన మోడీ.. దేవాన్ష్ చేతిని ప‌ట్టుకున్న సంద‌ర్భంగా.. దేవాన్స్ కేరింత‌లు కొట్ట‌టం చూపురుల‌ను ఆక‌ర్షించింది.

అదే స‌మ‌యంలో.. త‌న క‌ళ్ల‌జోడును తీసి దేవాన్ష్ కి పెట్టిన మోడీ.. కాసేపు చిన్నారిని ముద్దు చేశారు. మోడీ లాంటి వ్య‌క్తి కాసేపు చిన్న‌పిల్లాడితో ఆడుకోవ‌టం అంద‌రిని ఆక‌ర్షించింది.
Tags:    

Similar News