ప్రధాని మోడీ ఎంత వర్క్ హాలిక్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆదివారాలు సైతం ఆయన సెలవు తీసుకోకుండా పని చేస్తుంటారు. ఆయనకంటూ కుటుంబం ఉన్నా.. వారితో ఆయన కలిసి ఉండేది తక్కువే. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తల్లి వద్దకు వెళ్లి.. ఆమె ఆశీర్వాదం తీసుకుంటుంటారు.
దివంగత కరుణ లాంటి నేతల్ని తన ఇంట్లో ఉంచుకొని వైద్య సేవలు చేయిస్తానని చెప్పే మోడీ.. తన కుటుంబ సభ్యుల్లో ఎవరిని మాత్రం తన ఇంట్లో ఉంచుకోకపోవటం ఆయనలోని వైరుధ్యాన్ని చెప్పేస్తుంది. ఇలాంటి సీరియస్ మోడీ.. ఒక బుజ్జాయితో ఆటలాడుకునే వైనం ఇప్పటివరకూ పెద్దగా చూసింది లేదు.
తాజాగా ఒక చిన్నారిని తన ఒడిలో పెట్టుకొని ఆటలాడిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. ఆ చిన్నారి ఎవరు? ఎవరికి చెందిన వారు? అన్న విషయాల మీద వివరాలు తొలుత బయటకు రాలేదు. క్షణాల్లో వైరల్ గా మారిన ఈ పిక్ లో ఉన్న చిన్నారి ఎవరు? అన్నది తేల్చేందుకు మీడియా.. సోషల్ మీడియాలో తెగ ట్రై చేశాయి. చివరకు ఆ వివరాల్ని బయటపెట్టారు.
ముద్దులొలికే చిన్నారి పేరు రుద్రాక్షి. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత సత్యానారాయణ జటియా ఆయన కుమారుడు రాజ్ కుమార్ కుటుంబం మంగళవారం పార్లమెంటు భవనంలోని ప్రధాని మోడీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తమ పార్టీ నేత మనమరాలిని దగ్గరకు తీసుకున్న మోడీ.. ఆ పాపతో కాసేపు గడిపారు. అప్పుడు తీసిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్ స్టాలో ఆయన ఉంచిన ఫోటోను కేవలం 9 గంటల వ్యవధిలో 25.89 లక్షల మంది లైక్ చేయగా.. ప్రస్తుతం ( ఈ వార్త రాసే సమయానికి) 27.62లక్షల మంది లైక్ చేశారు.
పాప చేతిలో వెండి పళ్లెం ఉండటం చూస్తే.. మోడీ ఆ పాపకు బహుమతిగా ఇచ్చినట్లుగా ఉంది. రెండు చేతులతో చిన్నారిని అపురూపంగా ఆడిస్తున్న ఫోటో చూసినంతనే ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలిపోవటానికి దాదాపు ఐదారు గంటల ముందు ఈ ఫోటోను మోడీ పోస్ట్ చేయటం గమనార్హం. చిన్నారిని ఆడించినంత అలవోకగా.. రాజకీయాల్ని కూడా అన్న భావన ఈ ఫోటోను చూసినంతనే కలుగక మానదు.