ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదంటారు. అందులోకి రాజకీయ ప్రత్యర్థిగా నరేంద్ర మోడీ లాంటి నేత ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. భావోద్వేగాన్ని ఎప్పుడు ఎంత పండించాలన్న విషయంపై ఆయనకున్న లెక్కలు అన్ని ఇన్ని కావు. ఈ విషయంలో ఆయన తీరును అంచనా వేయటం ఏ మాత్రం సాధ్యం కాదు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కానీ.. ఆ పార్టీని నడిపించే గాంధీ ఫ్యామిలీ కానీ సరైన పాఠాల్ని నేర్చుకోలేదన్నట్లుగా పరిస్థితి ఉందని చెప్పాలి.
ఈ మధ్యన విదేశీ పర్యటన చేసిన సందర్భంగా పలు వర్సిటీల్లో మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. మోడీ మీదా.. ఆయన రాజకీయాల మీదా.. భారత్ లోని తాజా పరిస్థితుల మీదా మాట్లాడటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు సాయం చేస్తుందన్న లెక్కల వరకు ఓకే కానీ.. ఈ వ్యాఖ్యలు విదేశీ వేదిక మీద కాకుండా స్వదేశీ వేదిక మీద మాట్లాడాల్సి ఉందన్న వాదన ఉంది.
తమ దేశంలో జరుగుతున్న పరిణామాల మీద విదేశీ వేదికల మీద మాట్లాడటం ద్వారా కలిగే ప్రయోజనం కంటే కూడా డ్యామేజే ఎక్కువన్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తుంటారు. దీనికి భిన్నమైన వాదనలు వినిపించినా.. మన వరకు మనం చూసుకుంటే.. ఇంట్లో పంచాయితీని తీసుకెళ్లి ఊళ్లో పెడితే ఏం జరుగుతుంది? సరిగ్గా అదే పోలికను రాహుల్ కు అన్వయిస్తే.. ఆయన చేసిన తప్పేమిటన్నది అర్థమవుతుంది.
ఇలాంటి తప్పుల కోసమే కాచుకొని చూసే నరేంద్ర మోడీ.. అందుకు తగ్గ వేదికను చూసుకొని ఓపెన్ అయ్యారు. గురి చూసి విడిచిన బాణం మాదిరి ఆయన విమర్శల్ని భావోద్వేగంతో రంగరించి వదిలారు. ఆయన మాటల్ని విన్నంతనే.. నిజమే కదా? ఇలాంటి పని ఎలా చేస్తారు? అన్న భావన కలిగేలా చేశారు. భారత ప్రజాస్వామ్యం గురించి లండన్ లో ప్రశ్నలా? అంటూ ఆయన అడిగిన ప్రశ్నకు.. మెజార్టీ నిజమే కదా? అన్న మాట రావటం ఖాయం. కాంగ్రెస్.. ఇతర ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వటంలో బిజీగా ఉన్నాయంటూ ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చిన మాట.. సూటిగా ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా ఉందని చెప్పాలి.
తాజాగా బెంగళూరు - మైసూర్ ఎక్స్ ప్రెస్ హైవే ను ప్రారంభించిన సందర్భంగా ఆయన దాన్ని జాతికి అంకితం చేశారు. ఇందుకోసం రూ.8479 కోట్లు ఖర్చు చేయటం తెలిసిందే. దీనికి అదనంగా రూ.4129కోట్ల ఖర్చుతో మైసూర్ - కుశల్ నగర్ మధ్య 92 కిలోమీటర్ల మేర నిర్మించిన నాలుగు వరుసల హైవే నిర్మాణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. వ్యూహాత్మకంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయటం ద్వారా.. కన్నడ ప్రజలు తమను మరోసారి ఆశీర్వదించాలన్న సందేశాన్ని ఆయన ఇచ్చేశారు.
కన్నడిగుల మనసును దోచుకునేలా మాట్లాడిన ఆయన.. విశ్వగురు బసవణ్ణ విగ్రహాన్ని లండన్ లో ఆవిష్కరించే భాగ్యం కొన్నేళ్ల క్రితమే లభించిందన్న ఆయన.. ఆ సందర్భంగా అదే లండన్ లో కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టారు. కాంగ్రెస్ తనపై నిరంతరం దుష్ప్రచారం చేస్తుందన్న ఆయన.. తాను మాత్రం డెవలప్ మెంట్ ను మాత్రమే కాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
'లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నలు లేవనెత్తటం చాలా దురదృష్టకరం. వాళ్లు బసవేశ్వర దేవుడిని, కర్ణాటక ప్రజలను, భారత ప్రజలను అవమానిస్తున్నారు. దేశాభివృద్ధి, ప్రజల పురోగతి కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం కృషి చేస్తోంటే.. కాంగ్రెస్, దాని మిత్రులు ఏం చేస్తున్నారు మోదీకి సమాధి తవ్వేందుకు కాంగ్రెస్ కలలు కంటోంది. కోట్లాది మంది తల్లులు, అక్కచెల్లెళ్లు.. కుమార్తెలు, ప్రజల ఆశీస్సులు మోదీకి ఉన్నాయని వారికి తెలియదు. అవే మోదీకి అతి పెద్ద రక్షణ కవచం' అని వ్యాఖ్యానించిన ఆయన వ్యాఖ్యలు కచ్ఛితంగా ప్రభావాన్ని చూపిస్తాయని మర్చిపోకూడదు. భావోద్వేగాన్ని పండించేందుకు ఏ చిన్న అవకాశాన్ని కాంగ్రెస్.. గాంధీ కుటుంబం ఎప్పటికి అర్థం చేసుకుంటుందో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.