మోడీ మ‌న‌సు గెలిచిన టీడీపీ ఎంపీ ఈయ‌నే

Update: 2019-02-13 17:30 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాట‌కారిత‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సంద‌ర్భం ఏదైనా - త‌నదైన శైలిలో ఆ ప‌రిస్థితిని తీర్చిదిద్దుకునే క‌ళ మోడీకి కొట్టిన పిండి. అలాంటి, మోడీకి కూడా టెన్ష‌న్లు ఉంటాయి. వాటిని ఉప‌శ‌మించేందుకు ఆయ‌న ఏం చేస్తారంటే...ఓ టీడీపీ ఎంపీని గుర్తు చేసుకుంటార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. లోక్‌ స‌భ‌లో ఇవాళ ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ - ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

బ‌డ్జెట్ ముగింపు సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత - లోక్‌ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే పై ప్ర‌శంస‌లు కురిపించారు. లోక్‌ స‌భ‌లో జ‌రిగిన కొన్ని అంశాల‌ను గుర్తు చేశారు. ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే స‌భ‌కు హాజ‌రైన తీరు ప‌ట్ల మోడీ ప్ర‌శంస‌లు వ్య‌క్తం చేశారు. అద్వానీ ఎలాగైతే స‌భ‌కు పూర్తి స‌మ‌యాన్ని కేటాయించేవారో అదే త‌ర‌హాలో ఖ‌ర్గే కూడా స‌భ‌కే అంకితం అయ్యార‌న్నారు. ఎంపీలు ఇలాంటివి నేర్చుకోవాల‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధిగా ఖ‌ర్గేకు 50 ఏళ్లు దాటినా ఆయ‌న స‌భ ప‌ట్ల చూపిస్తున్న గౌర‌వాన్ని మెచ్చుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌థి రాహుల్ గాంధీపై మోడీ వెరైటీ సెటైర్ వేశారు. పార్ల‌మెంట్‌ కు మొద‌టిసారి వ‌చ్చాన‌ని - ఇక్క‌డికి వ‌చ్చాక‌ త‌న‌కు కౌగిలింత గురించి తెలిసింద‌ని రాహుల్‌ ను ఎద్దేవా చేశారు. స‌భ‌లో క‌న్ను కొన్న‌ట్ట‌డం కూడా మొద‌టిసారి చూసిన‌ట్లు రాహుల్‌ను ఉద్దేశిస్తూ చ‌మ‌త్క‌రించారు. మీడియా కూడా ఆ సంఘ‌ట‌న‌ను సంబ‌రంగా చూపించింద‌న్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ.. స‌భ‌లు జ‌రిగిన ప్ర‌తిసారి టీడీపీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ విచిత్ర వేష‌ధార‌ణ‌తో ఆక‌ట్టుకునేవార‌నే సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎంపీ శివ‌ప్ర‌సాద్‌ ను ఉద్దేశిస్తూ ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ - లోక్‌ స‌భ‌లో టాలెంట్ ఉన్న స‌భ్యులకు కొద‌వ‌లేద‌న్నారు. యూట్యూబ్ వాళ్లు ఆ టాలెంట్‌ ను వాడుకుంటే బాగుంటుంద‌న్నారు. టీడీపీ ఎంపీ నార‌మ‌ల్లి శివ‌ప్ర‌సాద వేసిన వేష‌ధార‌ణ‌ను మోడీ త‌న ప్ర‌సంగంలో గుర్తు చేస్తూ... ఎంపీ శివ‌ప్ర‌సాద్ వేసిన వేశాల‌ను చూస్తే - టెన్ష‌న్లు అన్నీ పోయేవ‌న్నారు.




Tags:    

Similar News