మోడీ వరిపై రూపాయి పెంచితే ఏం చేసుకోవాలి ??

Update: 2022-06-11 03:01 GMT
రైతాంగానికి ఆదుకునే చ‌ర్య‌లు ఎప్ప‌టికప్పుడు తీసుకుంటున్నామ‌ని, సేద్య‌గాడికి అండ‌గా ఉంటామ‌ని కేంద్రం చెబుతున్నా  ఆ విధంగా క్షేత్ర స్థాయి ఫ‌లితాలు లేనే లేవ‌ని తెలుస్తోంది. ఓ వైపు పంట విరామం చేసేందుకు కోన‌సీమ రైతాంగం సిద్ధం అవుతుండ‌గా.. మరోవైపు కేంద్ర చేస్తున్న కంటి తుడుపు ప్ర‌క్రియ లేదా ప్ర‌క‌ట‌న అన్న‌ది వీరి కోపాల‌ను రెట్టింపు చేస్తోంది. ఏటా సాగుకు అటు కేంద్రం ఇటు రాష్ట్రం అందిస్తున్న అరకొర సాయం కార‌ణంగానే తాము పంట పై ఆశ‌లు పూర్తిగా వ‌దులుకోవాల్సి వ‌స్తోంద‌ని,  ఈ ప‌నిలో లేదా ప్ర‌క్రియ‌లో రెండు ప్ర‌భుత్వాలూ త‌మ‌కు అన్యాయం చేస్తూనే ఉన్నాయి అని అంటోంది ఇక్క‌డి రైతాంగం.

మ‌రి ! కొన్ని చోట్ల ముంద‌స్తు ఖరీఫ్ మొద‌ల‌యినా కూడా ! కేంద్రం ఇచ్చే ఆ రూపాయి పెంపు (కిలో ధాన్యానికి మ‌ద్ద‌తు ధ‌ర రూపాయి చొప్పున పెంపు క్వింటాకు అంటే వంద కేజీల‌కు వంద రూపాయ‌లు) త‌మ‌కు వ‌ద్దే వ‌ద్ద‌ని, వీలున్నంత మేర‌కు పంట దిగుబ‌డి వ‌చ్చే స‌మ‌యానికి త‌మ‌కు అయిన ఖర్చుని గ‌ణించి, ఆ లెక్క‌ల ప్ర‌కారం త‌మ‌కు సాయం చేస్తే  బాగుంటుంద‌ని, మ‌ద్ద‌తు ధ‌ర విష‌య‌మై మ‌రోసారి ఆలోచించ‌కుంటే మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని వీరంతా హెచ్చ‌రిస్తున్నారు.

ఈ ఏడు వ‌రి మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాకు వంద రూపాయ‌లు మాత్ర‌మే పెంచి ఓ కంటి తుడుపు చ‌ర్య‌కు ఆస్కారం ఇచ్చారు మోడీ. అయితే ఈ పెంపు వల్ల త‌మ‌కేమీ లాభం ఉంద‌ని కోన‌సీమ రైతులు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికే తీవ్ర సంక్షోభంలో ఉన్న త‌మ‌కు ఈ పెంపు ఏ విధంగానూ క‌లిసి రాదనే అంటున్నారు.

ఆవేద‌న చెందారు. కేజీ ధాన్యం మ‌ద్ద‌తు ధ‌ర రూపాయి పెంచినంత మాత్రాన త‌మ‌కు ఒన‌గూరేది ఏమీ ఉండ‌దు అని కోన‌సీమ రైతాంగం గ‌గ్గోలు పెడుతున్నారు. మ‌రి ! రైతాంగంపై మోడీ ప్రేమ ఈ మేర‌కు మున్ముందు ఏ మేర‌కు ఉండ‌నుందో చూడాలిక ! ఇప్ప‌టిదాకా ఉన్న క్వింటా ధాన్యం మ‌ద్ద‌తు ధ‌ర 1940 ఉండ‌గా తాజా పెంపుతో అది 2040 అయింది. ఇదేమాత్రం త‌మ‌కు అనుకూలం కాద‌నే తేల్చేస్తూ, ఈ ఏడాది త‌మ‌తో పాటు క‌డియం రైతులు కూడా పంట విరామం ప్ర‌క‌టించేందుకు సిద్ధం అవుతున్నార‌ని వీరంతా చెబుతున్నారు.

మోడీ ప్ర‌క‌టించిన మ‌ద్ద‌తు ధ‌ర‌లలో ఒక్క నువ్వుల పంటకే అత్య‌ధికంగా 500 రూపాయ‌లకు పైగా పెంచారు.. అని ! మిగ‌తా పంట‌ల‌కు మాత్రం తూతూ మంత్రంగానే పెంచి త‌ప్పుకున్నారు అన్న విమ‌ర్శలే వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైనా మోడీ త‌న నిర్ణ‌యాల‌ను పునః స‌మీక్షించుకుని, పెట్టుబ‌డుల‌కు అనుగుణంగా మ‌ద్ద‌తు ధ‌ర‌లు నిర్ణ‌యించాల‌ని కోరుతున్నారు రైతాంగం.

కేంద్రం ప్ర‌క‌టించిన విధంగా ఒక్క‌సారి క‌నీస మ‌ద్దతు ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం

- నువ్వులు : 7307 రూపాయ‌లు ఎంఎస్పీ ఉండ‌గా
దానికి 523 రూపాయ‌లు అద‌నంగా జోడించి క‌నీస మ‌ద్దతు ధ‌ర‌ను 7530 చేశారు.

- జొన్న‌లు : 2,730 రూపాయ‌లు ఎంఎస్పీ ఉండ‌గా
దానికి 92 రూపాయ‌లు అద‌నంగా జోడించి క‌నీస మ‌ద్దతు ధ‌ర‌ను2830 చేశారు.

- సోయాబీన్  : 4000 రూపాయ‌లు ఎంఎస్పీ ఉండ‌గా
దానికి 300 రూపాయ‌లు అద‌నంగా జోడించి క‌నీస మ‌ద్దతు ధ‌ర‌ను 4300 చేశారు.

- పొద్దు తిరుగుడు : 6015 రూపాయ‌లు ఎంఎస్పీ ఉండ‌గా...

దానికి 385 రూపాయ‌లు అద‌నంగా జోడించి క‌నీస మ‌ద్దతు ధ‌ర‌ను 6400  చేశారు.

- మినుములు : 6300 రూపాయలు ఉండ‌గా తాజా ధ‌ర రూ.6600గా నిర్ణ‌యించారు. పెంపు : 300

- పెస‌లు : 7275 రూపాయ‌లు ఉండ‌గా తాజా ధ‌ర రూ.7755 గా నిర్ణయించారు. పెంపు : 480

- స‌జ్జ‌లు : 2250 రూపాయ‌లు ఉండ‌గా తాజా ధ‌ర రూ.2350 గా నిర్ణ‌యించారు. పెంపు : 100

- కందులు : 6300 రూపాయ‌లు ఉండ‌గా తాజా ధ‌ర  రూ.6600 గా నిర్ణ‌యించారు. పెంపు : 300

- ప‌త్తి : 5726 రూపాయ‌లు ఉండ‌గా తాజా ధ‌ర రూ.6080గా నిర్ణ‌యించారు. పెంపు : 354
Tags:    

Similar News