యూట్యూబ్‌లో మోడీ రికార్డ్‌.. అన్ని దేశాల నేత‌లను వెన‌క్కి నెట్టారే

Update: 2022-02-02 03:30 GMT
మాట‌ల మాంత్రికుడు.. దేశ ప్రధాని న‌రేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. యూట్యూబ్ లో ఆయ‌న దూసుకుపో తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ఫాలోయింగ్ యూట్యూబ్‌లో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ కోటి సబ్‌స్క్రిప్షన్‌లను దాటింది. దీంతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి నాయకుల్లో అత్యధిక సబ్స్క్రైబర్లను కలిగిన రికార్డ్ను మోడీ సొంతం చేసుకున్న‌ట్టు అయింది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు చెందిన యూట్యూబ్ ఛానల్ 36 లక్షల సబ్స్క్రైబర్లతో రెండో స్థానంలో ఉంది.

వాస్త‌వానికి కొన్నాళ్ల కింద‌ట ట్విట్ట‌ర్‌లోనూ ప్ర‌ధాని ముందున్నారు. అయితే.. ఆయ‌న ట్విట్ట‌ర్ హ్యాక్ అవ‌డంతో ఫాలోవ‌ర్లు త‌గ్గిపో యారు. కానీ, యూట్యూబ్‌లో మాత్రం ఆయ‌న ప్రసంగాలకు ఫాలోవ‌ర్లు ఫిదా అవుతున్నారు. ఇదే ఆయ‌న‌కు ప్ర‌పంచ స్థాయిలో రికార్డును సొంతం చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. ప్ర‌తిప‌క్షాల‌పై మాట‌ల తూటాలు పేల్చ‌డంలోనూ.. స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందించ‌డంలోనూ.. మోడీ ముందున్న విష‌యం తెలిసిందే. అదేప‌నిగా ఆయ‌న విమ‌ర్శించ‌రు. కానీ. విమ‌ర్శ చేస్తే.. మాత్రం అది ప్ర‌తిప‌క్షాల‌కు సూటిగా సుత్తిలేకుండా త‌గులుతుంది. ఇక‌, అభివృద్ధికి సంబంధించిన ప‌నుల‌కు సంబంధించి ఆయ‌న దూకుడుగా ఉన్నారు.

ఇదే.. యూట్యూబ్‌లో మోడీకి మంచి మార్కులు వేసేలా చేసింది. ఫాలోవ‌ర్లు కూడా పెరిగిపోయారు. ప్ర‌స్తుతం మోడీకి యూట్యూబ్‌లో ఫాలోవ‌ర్లు రెండు కోట్లు ఉంటే.. స‌బ్ స్క్రిప్ష‌న్లు.. కోటిదాటాయి. ఇక‌, ప్ర‌పంచ దేశాధినేత‌లు.. మోడీ ద‌రిదాపుల్లో కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంద‌రూ కూడా 50 ల‌క్ష‌ల స‌బ్ స్క్రిప్ష‌న్ల లోపే ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో మోడీ రికార్డును ఎవ‌రూ ఇప్ప‌ట్లో చేరుకునే అవ‌కాశం కూడా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌కు స‌బ్‌స్క్రైబ‌ర్లు త‌గ్గుముఖం ప‌ట్టారు.

మోడీకి క‌నుచూపు మేర‌లో కూడా కాంగ్రెస్ నేత రాహుల్ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛానల్కు 5.25 లక్షల మంది మాత్ర‌మే స‌బ్‌స్కైబ‌ర్లు ఉన్నారు. ఇక‌, ఇదే పార్టీ వివాదాస్ప‌ద నేత, ఎంపీ శశి థరూర్ ఛానల్కు 4.39 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. హైద‌రాబాద్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ అసదుద్దీన్ ఓవైసీకి 3.73 లక్షల సబ్స్క్రైబర్లు ఉండ‌గా, తమిళనాడు సీఎం స్టాలిన్ ఛానల్కు 2.12 లక్షల మంది మాత్ర‌మే ఉన్నారు.  

ఇత‌ర దేశాధినేత‌ల‌కు యూట్యూబ్ స‌బ్ స్క్రిప్ష‌న్లు.. ఇలా..

మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్కు 30.7 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు.

ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొలకు 28.8 లక్షలు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 7.03 లక్షలు.
Tags:    

Similar News