ప్రధాని నరేంద్రమోడీ మరో అరుదైన ఘనత సాధించాడు.. ఆయనంటే ఇప్పటికీ దేశ జనాలకే పిచ్చియే.. మోడీ కనపడితే చాలు పిచ్చిగా చూసేస్తున్నారు. బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) 2019-2020 వార్షిక టీవీ వ్యూవర్‌షిప్ నివేదిక ప్రకారం.. గత ఏడాది భారతదేశంలో టెలివిజన్‌లో అత్యధికంగా వీక్షించిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. కరోనా కల్లోలంలో కోవిడ్ మహమ్మారికి సంబంధించి ప్రధాని మోడీ బహిరంగ ప్రసంగాలు.. ఆయన చేసిన ప్రసంగాలపై దేశ ప్రజలంతా దృష్టి సారించారు.
దేశంలో మోడి వేవ్ ఇప్పటికీ ఉందని తేటతెల్లమైంది. మోడీ ఇంటర్వ్యూలు, గ్లోబల్ ఈవెంట్స్ ప్రసంగాలు, దేశానికి దిశానిర్దేశాలు.. మోడీ వన్యప్రాణి అడ్వెంచర్ షో అయినా సరే జనాలు బాగా చూస్తున్నారని నివేదికలో తేలింది. కంటెంట్ ను ప్రసారం చేసే ఛానెల్స్ కు వ్యూయర్ షిప్ బాగా వచ్చిందని తేలింది. ఇవి మోడీ ప్రతిష్టను కొత్త స్థాయికి తీసుకెళ్లాయని తెలుస్తోంది." అని పిఎం మోడీ చూపిన ప్రభావాన్ని వివరిస్తూ బార్క్ నివేదిక ఇచ్చింది.
ముఖ్యంగా ఎర్రకోటలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని 133 మిలియన్ల మంది ప్రేక్షకులు చూశారని పేర్కొంది. 2019లో ఆయన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంతో పోలిస్తే 40 శాతం పెరిగిందని పేర్కొంది. ఇక మొదటి లాక్డౌన్ ప్రకటించిన 2020 మార్చి 24 న ప్రధాని చేసిన ప్రసంగం, అతని మునుపటి ప్రసంగాల కంటే ఎక్కువ వ్యూయర్ షిప్ దక్కిందని తేలింది.2020 ఏప్రిల్‌లో దేశానికి మోడీ చేసిన ప్రసంగం.. రూ.20 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించిన సందర్భాన్ని ఏకంగా 203 మిలియన్ల మంది ప్రేక్షకులు చూశారని.. అత్యధికంగా వీక్షించిన వీడియోగా ఇది నిలిచింది.
"ప్రధాని మోడీ కరోనావైరస్ సంబంధిత ప్రసంగాలను ప్రసారం చేసిన ప్రతిసారీ, జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ (జిఇసి), మూవీస్ మరియు కిడ్స్ వంటి ప్రధాన వ్యూయర్ షిప్ వీక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది" అని నివేదిక తెలిపింది. తొమ్మిది నిముషాల పాటు లైట్లు ఆపివేయడం ద్వారా సంఘీభావం కోసం ఆయన చేసిన పిలుపు, ఆ తొమ్మిది నిమిషాల సమయంలో టీవీ వీక్షకుల సంఖ్య 60 శాతం క్షీణించిందని బార్క్ తెలిపింది.
మహమ్మారి కారణంగా, మరియు ప్రభుత్వ చర్యలు మరియు ప్రకటనల పట్ల పెరుగుతున్న ఉత్సుకతను పెంచాయని.. మొత్తం టీవీ వీక్షకులలో వార్తల వాటా మూడు రెట్లు పెరిగిందని, ఇది గతంలో ఏడు శాతం వృద్ధిని సాధించిందని నివేదిక పేర్కొంది.