గంటకు 180 కిలోమీటర్ల పరుగు.. ఒక్కో కోచ్ 23 మీటర్ల పొడువు.. ఆటోమేటిక్ గా తెరుచుకునే డోర్లు.. 360 డిగ్రీల్లో తిరిగే సీట్లు.. ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కానుకగా పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య తొలి రైలును సంక్రాంతి కానుకగా ఈనెల 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఈ మేరకు ఇటీవల రైల్వే అధికారులు విశాఖపట్నం వెళ్లి అక్కడి స్టేషన్ ను పరిశీలించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈనెల 19న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాయిదా వేద్దామనుకున్నారు. కానీ ఆ తరువాత ఈనెల 15న ఎట్టకేలకు ముహుర్తం పెట్టారు.
దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం వెళ్లాలంటే బస్సు లేదా కారు ద్వారా 11 నుంచి 12 గంటల సమయం పట్టేది. ఇక ఈ రెండు నగరాల మధ్య రైలు మార్గం 701 కిలోమీటర్లు.
ఇలా వెళ్లినా దాదాపు 11 గంటల జర్నీ. కానీ ఇప్పుడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ద్వారా కేవలం 8 గంటల్లో విశాఖ, సికింద్రాబాద్ నగరాలకు చేరుకోవచ్చు. మిగతా రైళ్లతో పోలిస్తే ఇందులో ఫీచర్స్ ఎక్కువగా ఉండడంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను తెలుగు రాష్ట్రాలకు తీసుకురావాలని కోరుతున్నారు. ఇన్నాల్టీకి ఆ ముహూర్తం కుదిరింది.
ఈనెల 12న మోదీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు ముందుగా షెడ్యూల్ ఖారారైంది. ఆ తరువాత 19వ తేదీన నిర్ణయించారు. అయితే వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కొందరు గుర్తు తెలియని వారు రాళ్లు విసిరారు.
ఈ ఘటనలో ఎక్స్ ప్రెస్ కోచ్ అద్దాలు పలిగిపోయాయి. మెయింటనెన్స్ కోసం దీనిని దీసుకెళ్తున్న సమయంలో కంచపాలెం వద్ద ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో కార్యక్రమాన్ని వాయిదా వేద్దామని అనుకున్నారు. కానీ ఆ తరువాత తెలుగు రాష్ట్రాల పండుగ సంక్రాంతి సందర్భంగా ప్రారంభిస్తే తెలుగువారికి కానుకగా ఇచ్చినట్లవుతుందని భావించారు. అందువల్ల యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య నడిచే ఈ రైలును సికింద్రాబాద్ లో ప్రధాని ప్రారంభించనున్నారు. దేశంలో ఇప్పటి వరకు 5 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది ఆరవది. దక్షిణాదిలో రెండోది. దీంతో ఈ రైలు ప్రారంభంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.