పౌరసత్వ బిల్లు పై మోడీ సంచలన కామెంట్స్

Update: 2019-12-11 09:42 GMT
పౌరసత్వ సవరణ బిల్లు.. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభ ప్రవేశపెట్టారు. తాజాగా బుధవారం రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వచ్చింది. ప్రధానంగా మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల నుంచి భారత్ కు నివాసం ఉన్న మైనార్టీలకు ఈ బిల్లు ద్వారా మన దేశ పౌరసత్వం కల్పిస్తారు.

అయితే ఈ బిల్లు వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడులో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బోటాబోటా మెజార్టీ ఉన్న రాజ్యసభ ముందుకు ఈరోజు బిల్లు రాబోతోంది.

రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశ పెట్టనున్న నేపథ్యం లో ప్రధాని మోడీ బుధవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లును సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చని.. మతపరమైన వేధింపులకు, హింసకు గురైన మన దేశానికి వచ్చిన మైనార్టీ ప్రజలకు ఈ బిల్లు ఉపశమనం కలిగిస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్నాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర దేశాల్లోని ముస్లింలు, మైనార్టీల కు అనుకూలంగా మోడీ సర్కారు తెస్తున్న ఈ బిల్లుపై దేశంలోని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇలాంటి జాతీయవాదం విషయంలో మోడీ సర్కారు అవలంభిస్తున్న వైఖరి వారికి మిగతా వర్గాల్లో మద్దతు దక్కేలా చేస్తోంది. ఆ కోవలోనే ఇలాంటి మత ప్రాతిపదిక రాజకీయాలకు తెరలేపుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


Tags:    

Similar News