కర్ణాటక మాజీ యడ్యూరప్ప బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం పీఠం నుంచి వైదొలిగారు. అయితే తన వర్గంతో అసమ్మతి రాజేస్తున్నారన్న సంకేతాలు పంపడంతో ఆయనపై కేంద్రంలోని మోడీ సర్కార్ కొరఢా ఝలిపిస్తోంది. తాజాగా యడ్యూరప్ప వర్గానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ దెబ్బకు మాజీ సీఎం అనుచరుల మైండ్ బ్లాంక్ అయ్యింది.
మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప పీఏతోపాటు ఆయన వర్గంలోని వారీగా ముద్ర వేసుకున్న ప్రముఖ కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. బెంగళూరు నగరంతో సహా కర్ణాటకలోని అనేక జిల్లాల్లో గురవారం ఏకకాలంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేశారు.
బీఎస్ యడ్యూరప్పతోపాటు ఆయన కుమారుడు బీవై విజయేంద్రకు అత్యంత సన్నిహితుల్లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉమేశ్ ఇంటిలో మూటకట్టి అటకలో విసిరేసిన అనేక కీలకమైన పత్రాలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2012 నుంచి యడ్యూరప్ప పీఏగా పనిచేస్తున్న ఉమేశ్ను, ఆయనకు ఆత్యంత సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు కాంట్రాక్టర్లను ఐటీ శాఖ అధికారులు టార్గెట్ చేసుకున్నారని తెలిసింది.
కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వర్గానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఊహించని షాక్ ఇచ్చారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప పీఏ ఉమేష్ తోపాటు ఆయన వర్గంలోని వారీగా ముద్ర వేసుకున్న ప్రముఖ కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీశాఖ అధికారులు సోదాములు చేస్తున్నారు.
ఆదాయపన్ను చెల్లించలేదని.. అక్రమంగా నగదు బదిలీ చేశారని మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప పీఏ ఉమేశ్ తోపాటు ఆయన అనుచరుల మీద ఆరోపణలు వచ్చిన సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.