మాటలు చెప్పటం వేరు. చెప్పిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని చేతల్లో చేసి చూపించటం వేరు. ప్రధాని మోడీ విషయానికి వస్తే.. మాటలే కాదు చేతల్లో చేసి చూపిస్తారన్న విషయాన్ని మరోమారు స్పష్టం చేశారని చెప్పాలి. ప్రతి ఒక్క భారతీయుడు వీఐపీనే అని చెప్పే మోడీ.. ప్రముఖుల ఎర్రబుగ్గల్ని తీసి పారేయించటం తెలిసిందే. ఎర్రబుగ్గల్ని తీయించే విషయంలో ఎంతటి కమిట్ మెంట్ ప్రదర్శించారో.. తాజాగా రోడ్డు మీద వెళుతున్న ఆయన.. తన వరకూ తాను సైతం వీఐపీ అన్న భావన ఉండదన్నట్లుగా వ్యవహరించారు.
తన కాన్వాయ్ ను ఆపేసి మరీ.. ఒక అంబులెన్స్ కు దారి ఇచ్చిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన షెడ్యూల్ ఆలస్యాన్ని పక్కన పెట్టేసి.. అంబులెన్స్ కు దారి ఇవ్వటమే ముఖ్యంగా వ్యవహరించారు. ఇందుకోసం సెక్యూరిటీ ప్రోటోకాల్ ను పక్కన పెట్టేశారు.ఈ ఆసక్తికర ఉదంతం ఎలా చోటు చేసుకుందన్న విషయంలోకి వెళితే.. ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ వార్షిక సమావేశంలో పాల్గొని గాంధీనగర్ - అహ్మదాబాద్ మార్గంలో వెళుతున్నారు.
వారి వెనుక ఒక అంబులెన్స్ వస్తున్న విషయాన్ని గుర్తించారు.
వెంటనే.. తన కాన్వాయ్ ను సైడ్ లేన్ లోకి తీసి ఆపాలని సూచించారు. ప్రధాని ఆదేశాలతో తూచా తప్పకుండా జరగటం.. వెనుక ఉన్న అంబులెన్స్ వెళ్లిపోవటం జరిగిపోయాయి. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అంబులెన్స్ కు దారి ఇవ్వటం కోసం తన వాహన శ్రేణిని పక్కకకు నిలిపివేయటం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/