ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును వదులుకోవటానికి ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ వ్యవహారంలో అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి తీసుకొని మరీ విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని అడ్డుకునే ఆందోళనలో పాల్గొంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య పెను సంచలనంగా మారింది.
స్వల్ప నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటానికి కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పలువురు తప్పు పట్టారు. పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఏపీలో పలుచోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి. విశాఖ నగరంలో అయితే ఏకంగా పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించారు. ఎవరేం చెప్పినా.. ఎన్ని అనుకున్నా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయాలన్న మొండితనం ప్రధాని మోడీలో ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున వస్తున్న అభ్యంతరాల్ని మోడీ సర్కారు పరిగణలోకి తీసుకోవటం లేదు. ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సైతం తప్పు పట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైజాగ్ స్టీల్ ను వదిలిపెట్టమని.. దాన్ని సొంతం చేసుకోవటానికి దేనికైనా రెఢీ అన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి అంశంపై తమ వైఖరిని స్పస్టం చేస్తూ.. ప్రధాని మోడీకి లేఖ రాసిన వైనం తెలిసిందే.
అయితే.. ఈ లేఖకు సానుకూలత పెద్దగా రాలేదని చెబుతారు. అంతలోనే కరోనా సెకండ్ వేవ్ షురూ కావటం.. ఆ హడావుడిలోనే కాలం గడిచిపోయింది. వాస్తవానికి కరోనా సెకండ్ వేవ్ వేళ.. విశాఖ ఉక్కు రెండు ఘనతల్ని సాధించింది. అందులో ఒకటి.. అపత్ కాలంలో ఆక్సిజన్ ను భారీగా ఉత్పత్తి చేయటం ఒక ఎత్తు అయితే.. మరోవైపు నిరంతరాయంగా పని చేసిన ఉక్కు కార్మికుల పుణ్యమా అని.. విశాఖ ఉక్కు లాభాల్లోకి వచ్చేసిన వైనం అందరిని ఆకర్షించింది.
సరైన నిర్వహణ ఉండాలే కానీ.. లాభాల మోత మోగించటంలో విశాఖ ఉక్కును తిరుగులేదన్న మాట బలంగా వినిపిస్తోంది.మొత్తంగా విశాఖ ఉక్కు అమ్మకానికి ఏపీ వాసులు నో అంటే నో అనేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవాలన్న మొండితనం ఉన్న మోడీ.. వైజాగ్ స్టీల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. కొంతకాలంగా ఈ ప్రాజెక్టు మీద ఎలాంటి అప్డేట్ కేంద్రం నుంచి రాలేదు. అందుకు భిన్నంగా తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
తాము అనుకుంటున్నట్లుగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం మరింత స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా న్యాయ సలహాదారు.. అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన సలహాలు ఇచ్చే వారికోసం ప్రభుత్వం బిడ్లకు ఆహ్వానం పలికింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ జనవరి 27న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా ఆపాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ సైతం వ్యతిరేకిస్తోంది.
ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోనూ చర్చలు జరిపారు. స్టీల్ ప్లాంట్ నుప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని కోరారు. అయినప్పటికీ కేంద్రం తాజాగా చేపట్టిన చర్యల్ని చూస్తే.. విశాఖ ఉక్కునుప్రైవేట్ పరం చేసే వరకు మోడీ సర్కారు నిద్ర పోయేలా లేదన్న భావన కలుగుతోంది. గత నెల 22న న్యూఢిల్లీలో జరిగిన దీపమ్ సమావేశంలో లీగల్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌లను నియమించాలని నిర్ణయించారు. బిడ్లకు సంబంధించిన దరఖాస్తులను బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
ప్రీ బిడ్ మీటింగ్ ఈనెల 15న ఏర్పాటు చేశారు. ఈనెల 28న దరఖాస్తుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. రూ.లక్ష అడ్వాన్సుగా.. రూ.కోటి సెక్యురిటీగా చూపించాలని చెబుతూ విడుదల చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో టెక్నికల్ బిడ్ ను ఈ నెల 29న తెరవనున్నట్లు చెబుతున్నారు. తాజాగా తీసుకున్న కేంద్ర యనిర్ణయాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలతో నిరసనలు మరింతగా పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.