రివేంజ్ తీర్చుకున్న మోడీ!

Update: 2022-02-15 07:38 GMT
రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య పోరులో ఆధిప‌త్యం సాధించాల‌ని అన్ని పార్టీలు చూస్తుంటాయి. ఏ సంద‌ర్బంలోనైనా ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయకుల చేతిలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురైతే తిరిగి రివెంజ్ తీసుకునేందుకు స‌మ‌యం కోసం వేచి చూస్తుంటారు.

ఇప్పుడు ప్ర‌ధాని మోడీ  కాంగ్రెస్‌పై ఆ రివేంజ్‌ను తీర్చుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రెండు ర‌కాలుగా కాంగ్రెస్‌ను మోడీ దెబ్బ‌కు దెబ్బ తీశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

సోమ‌వారం పంజాబ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం మోడీ జ‌లంధ‌ర్‌కు వ‌చ్చారు. అదే రోజు అక్కడి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్‌జీత్ సింగ్ చ‌న్నీ హోశియార్‌పుర్‌లో రాహుల్‌తో క‌లిసి ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. అందు కోసం చ‌న్నీ చండీగ‌ఢ్ నుంచి హెలికాప్ట‌ర్‌లో వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. కానీ అందుకు అధికారులు నిరాక‌రించారు.

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆ ప్రాంతాన్ని నో ఫ్ల‌యింగ్ జోన్‌గా ప్ర‌క‌టించిన‌ట్లు పేర్కొన్నారు. దీంతో త‌న హెలికాప్ట‌ర్‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డంపై చ‌న్నీ తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు. తాను ఓ ముఖ్య‌మంత్రిని అని ఉగ్ర‌వాదిని కాద‌ని వ్యాఖ్యానించారు.

దీనిపై ప్ర‌ధాని ఘాటుగా స్పందించారు. 2014లో తాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో త‌న హెలికాప్ట‌ర్‌ను రాహుల్ గాంధీ కోసం ఆపేశార‌ని మోడీ చెప్పారు. అప్పుడు త‌న‌ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించార‌ని ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వెళ్లేందుకు సిద్ధ‌మ‌వ‌గా నా హెలికాప్ట‌ర్‌ను అనుమ‌తించ‌లేద‌ని మోడీ పేర్కొన్నారు.

అప్పుడు అమృత్‌స‌ర్‌లో ఉన్న రాహుల్ కేవ‌లం ఓ ఎంపీ మాత్ర‌మేన‌ని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ఇటీవ‌ల పంజాబ్ వెళ్లిన మోడీ కాన్వాయ్‌ను రైతులు అడ్డుకోవ‌డంతో ఫ్లై ఓవ‌ర్ నుంచి వెన‌క్కి తిరిగి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ కావాల‌నే ఇలా చేసింద‌ని బీజేపీ నేత‌లు తీవ్రంగా విమ‌ర్శించింది. ఇప్పుడు మోడీ కోసం.. చ‌న్నీ హెలికాప్ట‌ర్‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో రెండు ర‌కాలుగా ఆయ‌న ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్లు అయింద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News