రాష్ట్రాల‌ను భ‌య పెడుతున్న మోడీ పెత్త‌నం ఇప్పుడు మ‌ళ్లీ?!

Update: 2021-03-24 15:33 GMT
కేంద్రంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నొప్పి తెలియ‌కుండానే రాష్ట్రాల‌కు ఉన్న అధికారాల‌ను ఒక్కొక్క‌టిగా త‌గ్గించేస్తున్నారు. వాస్త‌వానికి రాజ్యాంగం కేంద్రానికి, రాష్ట్రాల‌కు కొన్ని ప్ర‌త్యేక అధికారాల‌ను కేటాయించింది. రాష్ట్రాల‌పై పెత్తనం చేయ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వాన్ని సైతం నిలువ‌రించేలా ఆర్టిక‌ల్స్ అనేకం ఉన్నాయి. అయితే.. వాటిని ప‌క్క‌న పెట్టి మ‌రీ.. మోడీ స‌ర్కారు రాష్ట్రాల‌పై పెత్త‌నం చేస్తోంద‌నే వాద‌న ఇటీవ‌ల కాలంంలో ఎక్కువ‌గా వినిపిస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే `ఒన్ నేష‌న్‌-ఒన్ రేష‌న్‌`, ఒన్ నేష‌న్‌-ఒన్ ఎల‌క్ష‌న్‌` అంటూ.. అనే రూపాల్లో కేంద్రం రాష్ట్రాల‌ను నిలువ‌రించి.. త‌న అదీనంలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఇక‌, ఇప్ప‌టికే రెండు విష‌యాల్లో క‌నీసం రాష్ట్రాల‌ను సంప్ర‌దించ‌కుండానే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఫ‌లితంగా దేశ ఆర్తిక వ్య‌వ‌స్థ అత‌లాకుత‌లమైంద‌ని.. ఇలాంటి పోక‌డ‌లు చిన్న రాష్ట్రాలు, ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్న రాష్ట్రాల‌కు ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించింద‌ని ఆర్థిక నిపుణులు కొన్నాళ్లుగా హెచ్చ‌రిస్తున్నారు. ఈ రెండు నిర్ణ‌యాల్లో కీల‌క‌మైంది.. పెద్ద నోట్ల ర‌ద్దు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబందించి అప్ప‌టి వ‌ర‌కు పెద్ద నోట్లు రూ. 500, రూ. 1000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ.. 2016లో మోడీ అనూహ్య నిర్న‌యం తీసుకున్నారు. నిజానికి ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకునేందుకు గోప్యంగానైనా.. రాష్ట్రాల‌తో చ‌ర్చించాలి. కానీ.. మోడీ మాత్రం ఏక‌ప‌క్షంగా రాత్రికి రాత్రి నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. దీంతో దేశంలో చిన్న ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డి ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బ‌తింది.

ఇక‌, గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలోనూ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అంశంపైనా న‌రేంద్ర మోడీ ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే (అంటే.. రాష్ట్రాల‌ను) నిర్ణ‌యం తీసుకున్నారు. ఫ‌లితంగా.. రాష్ట్రాలు ఆర్ధికంగా తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. దీనిని అప్ప‌ట్లోనే ప‌శ్చిమ బెంగాల్ స‌హా ఒక‌టి రెండు రాష్ట్రాలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. అయితే.. కేంద్రం ఆదేశించిన నేప‌థ్యంలో త‌ప్ప‌ని ప‌రిస్థితిలో లాక్ డౌన్‌ను పాటించింది. ఇక‌, ఇప్పుడు కూడా ఇదే త‌ర‌హాలో రాష్ట్రాలు త‌ర్జ‌న భ‌ర్జ‌.న ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా రెండో ద‌శ ప్రారంభ‌మై.. కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఏ క్ష‌ణ‌మైనా.. న‌రేంద్ర మోడీ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తార‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకునే ముందు.. రాష్ట్రాల‌తో సంప్ర‌దించాల్సిన అవ‌స‌రం ఉన్నా.. మోడీ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యమే.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News