హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్న బీజేపీ, ఆ పార్టీ పెద్దాయన మోడీ గడిచిన ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ తోనే గెలిచారు. కానీ ఈసారి గెలుపు అంతా ఈజీ కాదని ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలతో తేటతెల్లమైంది. బీజేపీ పాలిత మూడు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో దారుణంగా ఓడిపోయాక ఇప్పుడు కమల నాథుల కన్ను ఇతర భాషల రాష్ట్రాలపై పడింది. ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించింది.
గడిచిన ఎన్నికల్లో భక్తి పారవశ్యం ఎక్కువగా ఉండే వారణాసి నుంచి మోడీ గెలుపొందారు. కానీ ఇప్పుడు వారణాసి ఉన్న యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీచేస్తుండడం.. బీజేపీపై వ్యతిరేకతతో మోడీకి చిక్కులు వచ్చిపడ్డాయి. అందుకే ఆయన తను పోటీచేసే నియోజకవర్గాన్ని మార్చుకుంటున్నారని తెలిసింది. టెంపుల్ సిటీలో ఈజీగా గెలువచ్చని వారణాసి గెలుపుతో మోడీ రుజువు చేశారు. ఇప్పుడదే ప్లాన్ తో ఒడిషాలోని పూరిలో బరిలోకి దిగుబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
తాజాగా ఒడిషా బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ పురోహిత్ మోడీ పూరి నుంచే పోటీచేయబోతున్నారని..2014 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీచేసిన ప్రధాని పూరి జగన్నాథుని ఆలయంలో ఆశీస్సులు తీసుకొని పూజలు చేసి వారణాసి బరిలో నిలిచి గెలిచాడన్నారు. ఇప్పుడు ఇక్కడే పోటీ చేయబోతున్నారని ప్రకటించారు. ఇక ఒడిషా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బసంత్ పండా కూడా మోడీ పూరి నుంచే పోటీచేసే అంశం బీజేపీ పరిశీలిస్తోందని తెలిపారు. ఇటీవల ఇంటర్వ్యూల్లో మోడీని ఇదే విషయంపై అడగ్గా సమాధానం దాటవేశారు.
ఒడిషాలో 20 ఏళ్లు బీజేడీ ప్రభుత్వం ఉంది. సీఎం నవీన్ పట్నాయక్ పై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈసారి అక్కడ ప్రతిపక్ష బీజేపీ గెలవడం ఖాయమని సర్వేలు తేల్చాయి. అందుకే మోడీ ఒడిషాను ఎంచుకున్నట్టు సమాచారం. కమలం గెలిచే చోటనే మోడీని బరిలో నిలిపితే పార్టీకి బలం వస్తుందని యోచిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఒడిషాలో మోడీ వల్ల కొన్ని సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరి మోడీ ఏం నిర్ణయించుకుంటారో చూడాలి మరి.