తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రస్తుతం దేశంలోనే కీలక పాత్ర వహిస్తున్న ముఖ్యమంత్రులతో అగ్రస్థానంలో ఉన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల కంటే ఒక అడుగు ముందుగానే కరోనా కట్టడికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసారు. ఆ తరువాత కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోని , రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కాకుండా చూసుకున్నారు. అలాగే కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలు ..ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. కేసీఆర్ బ్రతికున్నంత వరకు రాష్ట్రంలో ఒకరిని కూడా చావనివ్వడు అంటూ హామీ ఇచ్చారు. ఇలా ప్రజలకి దైర్యం చెప్పిన సీఎం ..దేశంలో మరొకరు లేరు. ఇక కేసీఆర్ ఎప్పుడు చెప్పే మరో మాట ..బ్రతికుంటే బలిశాకు తినొచ్చు .. ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించే సమయం కాదు ఇది అని ఎన్నో సార్లు చెప్పారు. అలాగే ముందుకు పోతున్నారు. ఇప్పుడు అవే మాటలు ప్రధాని మోడీ నోట్లో నుండి వచ్చాయి.
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో .. తోలి దశ లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ముందుగా మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కరోనా విషయంలో చాలా దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు కాస్త మెరుగైన స్థితిలో ఉందన్నారు. ప్రతీ పౌరుడు దేశం కోసం ఓ సైనికుడిలా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తున్న తరుణంలో... దీనిపై ఎలా ముందుకెళ్లాలి.. ప్రజలు కష్టాలు ఎలా తీర్చాలి.. వంటి అంశాలపై నిరంతర చర్చలు జరిపినట్టు తెలిపారు. అయితే ముందు ప్రజలని కాపాడుకుంటే .. ఆ తరువాత ఎలాగైనా ఆర్థిక సంక్షోభం నుండి బయటపడొచ్చు అని మోడీ తెలిపారు. కరోనాపై నిర్ణయాలు తీసుకునేముందు తాము దేశంలోని పేదలు - కూలీలు - రైతులను దృష్టిలో పెట్టుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మొత్తంగా సీఎం కేసీఆర్ ముందు నుండి చెప్తున్నట్టే ...మొదట ప్రజలు ..ఆ తరువాతే అన్ని అని మోదీ కూడా స్పష్టం చేసారు.