ప్రపంచం పూర్తిగా మారిపోయింది. వర్తమానంలోనే కాదు.. భవిష్యత్తులోనూ మాయదారి మహమ్మారికి ముందు.. తర్వాత అనే విభజన రేఖ స్పష్టంగా మానవజీవనం మీద ఉండటం ఖాయం. రెండు ప్రపంచ యుద్ధాల కారణంగా పడిన ప్రభావం కంటే కూడా తాజా మహమ్మారి వేసిన దెబ్బ ఎక్కువని చెప్పాలి. మరణాలు తక్కువే కావొచ్చు. రక్తం ఏరులై పారకపోవచ్చు. కానీ.. ప్రజలు పడిన.. పడుతున్న భయాందోళనలు రెండు ప్రపంచ యుద్ధాలకు మించినవన్నది మరచిపోకూడదు.
ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన అత్యున్నత సమావేశం ఒకటి.. ఈ రోజు న్యూస్ పేపర్లలో ప్రముఖంగా అచ్చయింది. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ.. టీవీ చానళ్లలోనూ పెద్దగా ఫోకస్ కాని ఈ కార్యక్రమం ప్రింట్.. వెబ్ మీడియాలో ఈ రోజు ప్రముఖమైంది. ప్రధాని మోడీ.. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ ల మధ్య జరిగిన వర్చువల్ శిఖరాగ్ర సమావేశం ఆసక్తికరంగా మారింది. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. కాలం దేని కోసం ఆగదని.. మహమ్మారి కోసం కాస్త వేగం తగ్గినా.. తిరిగి ఆ దిశగా ప్రయాణించేందుకు వీలుగా తన రూటును మార్చుకున్న వైనం కనిపిస్తుంది.
సాధారణంగా రెండు దేశాలకు చెందిన ప్రధానులు కలిసేందుకు ఎవరో ఒకరు వెళ్లటం.. లేదంటే ఏదైనా సమావేశానికి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా భేటీ కావటం ఉంటుంది. ఇందుకు భిన్నంగా వర్చువల్ గా.. వీడియో కాన్పరెన్సులోరెండు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు.. అధికారులు భేటీ అయి.. ఒప్పందాన్ని కుదుర్చుకోవటం ఇదే తొలిసారి. ఇంతకీ ఈ రెండు దేశాల మధ్య తాజాగా జరిగిన ఒప్పందం రెండు దేశాల మైత్రిని మరింత పెంచటమే కాదు.. సైనిక స్థావరాల్ని పరస్పర ప్రాతిపదికన ఉపయోగించుకోవటానికి కీలకంగా మారనున్నాయి.
వాస్తవానికి ఈ సమావేశం కోసం ఆస్ట్రేలియా ప్రధాని భారత్ కు రావాల్సి ఉంది. మాయదారిరోగం కారణంగా అది కాస్తా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వర్చువల్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒప్పందాన్ని పూర్తి చేశారు. తాజాగా జరిగిన ఈ సమావేశం ఇచ్చే సంకేతం ఏమంటే.. రానున్న రోజుల్లోకూడా మాయదారి రోగంతో సహజీవనం చేస్తూనే బతుకు బండిని లాగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గతంలో మాదిరే అన్ని పనుల్ని చేసుకోవాల్సి ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఆ విషయాన్ని స్పష్టం చేసేలా తాజా వర్చువల్ శిఖరాగ్ర సమావేశం ఉందని చెప్పాలి. రానున్న రోజుల్లోనే వర్చువల్ మీటింగ్ ల ద్వారా కీలకమైన ఒప్పందాలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. కాలం.. పరిస్థితులకు తగ్గట్లుగా మనిషి మారతాడన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు.