చంద్ర‌బాబు ఊసేలేకుండా మోడీ ప‌ర్య‌ట‌న‌.. సందేశం ఏంటి?

Update: 2022-11-12 09:31 GMT
మూడు నెల‌ల కింద‌ట ప్ర‌ధాని మోడీని చంద్ర‌బాబు క‌లుసుకున్నారు. ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. మోడీ ఆయ‌న‌కు అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో 2019 త‌ర్వాత‌.. మ‌ళ్లీ టీడీపీ-బీజేపీల మ‌ధ్య పొత్తు పొడుస్తోంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సంకేతాలు బీజేపీ వైపు నుంచి రాలేదు. పైగా.. చంద్ర‌బాబుకు అనుకున్న విధంగా ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని తెలుస్తోంది.

తాజాగా ప్ర‌ధాని మోడీ ఏపీకి వ‌చ్చారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఆయ‌న‌ను క‌లిశారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ అధినేత 14 ఏళ్ల సీఎం చంద్ర‌బాబుకు మాట మాత్రంగా కూడా మోడీ ఎలాంటి వ‌ర్త‌మానం పంప లేదు. రండి వ‌చ్చి క‌ల‌వండి! అని ఇటీవ‌ల ఆయ‌న చంద్ర‌బాబుకు ప‌దే ప‌దే చెప్పారు. మరి ఢిల్లీకి వ‌చ్చి క‌ల‌వాల‌ని సూచించిన ఆయ‌న‌.. ఏపీకి తాను స్వ‌యంగా వ‌చ్చిన‌ప్పుడు బాబుకు ఎందుకు దూరంగా ఉన్నార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ విష‌యంలో మోడీని ఎవరైనా త‌ప్పుబ‌ట్టించారా?  లేక‌.. ఇప్పుడు అవ‌స‌రం లేద‌ని ఆయ‌నే భావిస్తున్నా రా? అనేది ఆస‌క్తిగా మారింది. నిజానికి చంద్ర‌బాబు పైకి చెప్ప‌క‌పోయినా.. మోడీని క‌లుసుకునేందు కు ఉత్సాహంగానే ఉన్నారు. కానీ, అనూహ్యంగా బీజేపీ వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రాక‌పోగా.. పీఎంవో నుంచి కూడా ఎలాంటి క‌ద‌లిక లేకుండా పోయింది.

ఈ ప‌రిణామం.. టీడీపీనే కాదు.. రాష్ట్ర రాజ‌కీయాల‌ను కూడా క‌ద‌లించింది. ఎందుకంటే.. మోడీ వ‌స్తే.. ప‌వ‌న్‌ను క‌లిశారు. సీఎం జ‌గ‌న్‌తో కార్య‌క్ర‌మాలు పెట్టుకుంటున్నారు. ఇంత చేస్తున్న మోడీ.. త‌న‌ను ఇటీవ‌లే క‌లిసిన చంద్ర‌బాబును ప‌క్క‌న పెట్టారంటే.. రాజ‌కీయంగా బాబుకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైందా?  అనే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి ఇవి వైసీపీకి అస్త్రాలుగా మార‌తాయా?   లేక టీడీపీ ఎలా స‌మ‌ర్థించుకుంటుంది? అనేది ఆస‌క్తిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News