పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన పార్లమెంటరీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని.. ఎంపీలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగింది. పార్లమెంట్ లో కాకుండా మరో చోట ఈసారి పెట్టారు. ఈ సందర్భంగా ఎంపీల తీరుపై మోడీ మండిపడ్డట్టు తెలిసింది.
ఎంపీలు ఇకనైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని.. లేదంటే మార్పులు తప్పవని మోడీ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వండి..చిన్న పిల్లలకు చెప్పినట్లు ప్రతీసారి దీని గురించి నేను ఎంపీలకు చెప్పడం బాలేదు.. కనీసం పిల్లలు కూడా ఒక విషయాన్ని పదేపదే చెప్పించుకోరు. ఇకనైనా మారండి.. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే.. మార్పులు జరుగుతాయి’ అంటూ బీజేపీ ఎంపీలకు మోడీ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు కావద్దని.. ప్రొసీడింగ్స్ జరుగుతున్న సమయంలో సభలోనే ఉండాలని తీవ్ర స్వరంతో మోడీ బీజేపీ ఎంపీలను హెచ్చరించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తావించకుండానే ప్రజారోగ్యంపై బీజేపీ ఎంపీలు ఫోకస్ పెట్టాలని మోడీ సూచించారు.
కాగా.. ఎంపీల గైర్హాజరుపై మోడీ గతంలోనూ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీలు క్రమశిక్షణ పాటించాలని.. అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు.
ఇక ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రధాని సూచించినట్టు తెలిపారు.