గుజరాత్ పటేల్ విగ్రహానికి విశాఖ ఉక్కు వాడి ఇప్పుడు ప్రైవేట్ చేస్తారా మోడీజీ?
విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరిస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయంపై ఏపీలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పార్టీలకు అతీతంగా మద్దతు ప్రకటించారు. ఇటీవల బంద్ కూడా సక్సెస్ అయ్యింది.
ప్రత్యక్షంగా ... పరోక్షంగా లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి రాసిన లేఖ సంచలనమైంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్మాయాలు చూడాలని ప్రధాని మోడీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన లేఖ రాశారు. ‘సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ ఇదేనని.. ఎగుమతి, దిగుమతులకు అనువైన ప్రాంతమని.. రానున్న కాలంలో స్టీల్ కు డిమాండ్ పెరుగుతుందని లేఖలో జేడీ వివరించారు.
విశాఖ స్టీల్ పరిశ్రమను ప్రైవేటీకరిస్తే ధరలన్నీ ప్రైవేట్ వాళ్ల చేతుల్లో ఉంటాయని.. స్టీల్ కొనడం కష్టమవుతుందని జేడీ ఆక్షేపించారు. గుజరాత్ పటేల్ విగ్రహానికి విశాఖ ఉక్కునే వాడారు అని లేఖలో జేడీ లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్ చేశారు.